పాలనా పరమైన ప్రక్షాళ దిశగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున ఐఏఎస్.. ఐపీఎస్ లను బదిలీలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాలనలో తనదైన ముద్ర వేయాలని తపిస్తున్న జగన్.. అందుకోసం విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటానికి ముందు నుంచి ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాను అధికారంలోకి రావటం పక్కా అన్న నమ్మకంతో ఉన్న జగన్ అందుకు తగ్గట్లే.. పాలన విషయంలో ఏమేం చేయాలన్న దానిపై భారీ కసరత్తు చేశారు. దీనికి తోడు.. పాలనా పరమైన అనుభవంలో భాగంగా ఐదారు రోజులు అన్ని విషయాల్ని గమనించిన జగన్.. మంగళవారం సాయంత్రం అధికారుల బదిలీలపై నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హోదా నుంచి జిల్లా కలెక్టర్ల వరకూ బదిలీలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లను మార్చిన జగన్.. నాలుగు జిల్లాల విషయంలో మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. అలా కంటిన్యూ చేస్తున్న వారిలో కడప జిల్లా కలెక్టర్ ఒకరు. మొత్తం 44 మంది ఐఎస్.. ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న కొద్ది మంది అధికారులకు పోస్టింగులు ఇవ్వని జగన్ సర్కారు.. మరో వైపు.. గత ప్రభుత్వంలో తమ పని తాము చేసుకుంటూ పోయిన ఎక్కువ అధికారులకు మంచి పోస్టింగులు దక్కాయి. చిత్రమైన విషయం ఏమంటే.. జగన్ కు బాగా సన్నిహితంగా ఉంటారన్న పేరున్న అధికారులకు మంచి పోస్టింగులు దక్కుతాయని.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారికి ప్రాధాన్యత ఉన్న పదవులు లభించవన్న వాదనలో అర్థం లేదన్న విషయం తాజా బదిలీల్ని చూస్తే అర్థం కాక మానదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కొందరు కలెక్టర్ల విషయంలో మాత్రం జగన్ భిన్నంగా వ్యవహరించారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కర్నూలు కలెక్టర్ సత్యానారాయణను అనంతపురం కలెక్టర్ గా.. ప్రకాశం కలెక్టర్ ను విశాఖకు.. నెల్లూరు కలెక్టర్ ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. అదే సమయంలో కలెక్టర్ గా వ్యవహరించాలని ఆకాంక్షిస్తున్న శాప్ ఎంపీ ఎం.వీ. శేషగిరిబాబును నెల్లూరు జిల్లా కలెక్టర్ గా నియమించారు.
తాజా బదిలీలకు సంబంధించి కొందరు అధికారులకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వీరందరికి జీఏడీకి (సాధారణ పరిపాలనా విభాగానికి) రిపోర్ట్ చేయాలని కోరటం గమనార్హం. పోస్టింగులు ఇవ్వని వారిలో అజయ్ జైన్.. విజయానంద్ తదితరులు ఉన్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని చెబుతున్నారు. ఆ బదిలీల్లో వీరికి బాధ్యతలు అప్పగించొచ్చని భావిస్తున్నారు.
అధికారి పేరు.. బదిలీ స్థానం
గౌతం సవాంగ్ (ఐపీఎస్) డీజీపీ (హెచ్ వోపీఎఫ్) - రహదారుల భద్రతా సంస్థ ఛైర్మన్
పీయూష్ కుమార్ వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్
క్రాంతిలాల్ దండే ఇంటర్ బోర్డు కమిషనర్
విజయ్‌కుమార్ పురపాలక శాఖ కమిషనర్
గిరిజా శంకర్ పంచాయితీరాజ్ - గ్రామీణాభివృద్ధి కమిషనర్
లక్ష్మీనృసింహం సీఆర్డీయే కమిషనర్
కాటమనేని భాస్కర్ పర్యాటక - యువజన - సాంస్కృతిక శాఖ ఎండీ
ప్రద్యుమ్న మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్
ఎం.ఎం.నాయక్ ఎక్సైజ్ శాఖ కమిషనర్
హర్షవర్దన్ సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్
ప్రవీణ్‌కుమార్ వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్
జె.మురళి ముఖ్యమంత్రి ఓఎస్డీ
విజయ సీఆర్డీయే అదనపు కమిషనర్
పి.సీతారామాంజనేయులు (ఐపీఎస్)రవాణా శాఖ కమిషనర్
చిరంజీవి చౌదరి (ఐఎఫ్ఎస్) ఉద్యాన శాఖ కమిషనర్
శామ్యూల్ ఆనంద్ గుంటూరు జిల్లా కలెక్టర్
పి. భాస్కర్ ప్రకాశం జిల్లా కలెక్టర్
డి. మురళీధర్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్
ఎంవీ శేషగిరిబాబు నెల్లూరు జిల్లా కలెక్టర్
ఎస్.సత్యనారాయణ అనంతపురం జిల్లా కలెక్టర్
ముత్యాల రాజు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్
వినయ్ చంద్ విశాఖ జిల్లా కలెక్టర్
వీరపాండ్యన్ కర్నూలు జిల్లా కలెక్టర్
నారాయణ్ భరత్ గుప్తా చిత్తూరు జిల్లా కలెక్టర్
జేఎస్వీ ప్రసాద్ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి
నీరబ్‌కుమార్ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఆదిత్యనాథ్ దాస్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
పూనం మాలకొండయ్య వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
కరికాల వలవెన్ బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
రజత్ భార్గవ పరిశ్రమలు - మౌలికసదుపాయాల ముఖ్యకార్యదర్శి
కేఎస్ జవహర్ రెడ్డి వైద్య -ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి
అనంతరాము గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి
కె. ప్రవీణ్ కుమార్ పర్యాటక - సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి
అజయ్ జైన్ జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
ఆర్పీ సిసోడియా సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి
విజయానంద్ జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
బి. రాజశేఖర్ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
ఎం.టి. కృష్ణబాబు రోడ్లు - భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి
కె.దమయంతి మహిళా - శిశుసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి
జె.శ్యామలరావు పురపాలక - పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి
నాగులాపల్లి శ్రీకాంత్ ఏపీ ట్రాన్స్‌కో ఎండీ
ముఖేశ్ మీనా సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి
బి. శ్రీధర్ ఏపీ జెన్‌కో ఎండీ
కోన శశిధర్ పౌరసరఫరాల శాఖ కమిషనర్
కేఆర్ఎం కిశోర్ కుమార్ (ఐపీఎస్) హోంశాఖ ముఖ్య కార్యదర్శి
వై.మధుసూదన్ రెడ్డి సహకార - మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి
కాశిరెడ్డి వీఆర్ ఎన్ రెడ్డి డీజీ - విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్