ప్రేమికుల రోజునే ఇద్దరు ఐఏఎస్ అధికారులు పెళ్లి పీఠలెక్కబోతున్నారు. విధి నిర్వహణలో బీజీబీజీగా గడిపే ఐఏఎస్ లు ప్రేమలోపడటంతో పాటు వారి పెళ్లికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి ప్రేమ, పెళ్లికి మరో ఐఏఎస్ అధికారి అండగా నిలువడం విశేషం. వారి ప్రేమ కథాకమామిషూ ఏంటంటే...
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన గౌతం కర్ణాటకలోని దావణగెరె జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గౌతం 2008సంవత్సరం సివిల్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 23వ ర్యాంక్ సాధించి 2009 కర్ణాటక బ్యాచ్ ఏఐఎస్ అధికారిగా కొనసాగుతున్నాడు. దావణగెరెలోనే పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిని అశ్వథితో గౌతం ప్రేమలో పడ్డాడు. కేరళకు చెందిన అశ్వథి జిల్లా పరిషత్ కార్యాలయంలో సీఈవోగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో వీరు తరుచూ పనిచేస్తున్న సమయంలోనే వీరిమధ్య ప్రేమ చిగురించింది.
వీరి ప్రేమకు ఇరువురి కుటుంబాల పెద్దలను ఒప్పించడంలో మరో ఐఏఎస్ అధికారి తనవంతు పాత్రను పోషించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. దీంతో ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న వీరి పెళ్లికి శుభంకార్డు పడింది. వీరి వివాహం కేరళలోని కాలికట్ లో జరుగనుంది. 17న గౌతం తన స్వగ్రామంలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఇటీవల కాలంలో ఐఏఎస్ ల ప్రేమ వివాహాలు ఎక్కువవుతున్నాయి.. ఏదిఏమైనా ఒక ఐఏఎస్ కు మరో ఐఏఎస్ భాగస్వామిగా రావడం అదృష్టమనే చెప్పాలి.