సంక్షేమ సార‌థ్యంలో వైసీపీ ర‌థానికి ఆటుపోట్లు..!

Update: 2022-10-15 02:30 GMT
మునుగోడు కేంద్రంగా టీ కాంగ్రెస్ లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు పెద్ద ఝలక్ ఇచ్చారు. ఆయన రాజకీయ భవిష్యత్తుని వీహెచ్ తేల్చేశారు. ఇది పార్టీ లాయలిస్టుకు మరో లాయలిస్టు హెచ్చరిక వంటిదని సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఎప్పుడూ ఆయనకు అనుకూలంగా వ్యవహరించే వీహెచ్ ఈసారి మాత్రం తీవ్ర గరం అయ్యారు.

వైసీపీ పాల‌న అన‌గానే నాయ‌కులు ఏం చెబుతున్నారు?  జ‌గ‌న్ ప‌రిపాల‌న అన‌గానే ఏం ఊద‌ర గొడుతు న్నారు?  దీనిని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. త‌మ‌ది సంక్షేమ ప్ర‌భుత్వ‌మ‌ని అంటున్నారు. అయితే.. అదేసంక్షేమం.. ఇప్పుడు వైసీపీకి ఎస‌రు పెడుతోంది. తాజాగా.. కీల‌క ఐఏఎస్ అధికారులు.. త‌యారు చేసిన పాల‌న‌పై నివేదిక దీనినే స్ప‌ష్టం చేస్తోంది. సంక్షేమం బాగుంద‌ని.. పాల‌కులు అంటు న్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం సంక్షేమ ర‌థానికి అనేక ఆటుపోట్లు ఎదుర‌వుతున్నాయి.

ఇదే విష‌యాన్ని..ఐఏఎస్‌లు నిర్మొహ‌మాటంగా వెల్ల‌డించారు. ``సంక్షేమం కొంద‌రికే అందుతోంది. వీరిలో నూ.. కొంద‌రు ప్ర‌భుత్వంపైవ్య‌తిరేక‌తతోనే ఉన్నారు. దీనికి కార‌ణాలు అన్వేషిస్తే.. ఉపాధి కొర‌వ‌డం ప్ర‌ధానంగా దెబ్బ‌కొడుతోంది`` ఇదీ.. ఒక సీనియ‌ర్ ఐఏఎస్ ఇచ్చిన నివేదిక సారాంశం. ఇది తాడేప‌ల్లి వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీస్తోంది. మూడేళ్లుగా.. ప్ర‌భుత్వం సంక్షేమాన్ని న‌మ్ముకుని ముందుకు సాగుతోంది. కానీ, ఉపాది విష‌యాన్ని మాత్రం విస్మ‌రించింద‌నేది ప్ర‌జ‌లు చెబుతున్న మాట‌.

దీనిపై ప్ర‌తిప‌క్షాలు యాగీ చేస్తున్నాయ‌ని.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశామ‌ని.. సచివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చామ‌ని.. వైసీపీ ప్ర‌భుత్వం చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఈ రెండు వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఉపాధి కోణంలో చూస్తే.ఇప్ప‌టికీ..  గ్రామ‌స్థాయిలో ప‌నులు వెతుక్కుంటూ.. ప‌ట్ట‌ణాల‌కు వ‌స్తున్న‌వారి సంఖ్య పెరుగుతోంది. కింద‌టి నెల కేంద్ర ప్ర‌భుత్వం కూడా.. ఇదే విష‌యాన్ని స్ప‌స్టం చేసింది.

గ్రామీణ స్థాయిలో ఏపీ ప‌రిస్థితి బాగోలేద‌ని.. ఉపాది రంగం తీవ్రంగా దెబ్బ‌తింద‌ని.. పేర్కొంది.. ముఖ్యంగా ఎంఎస్ ఎంఈ(సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌)ను ప్రోత్స‌హించాల‌ని సూచించింది. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌భుత్వం బ్యాంకుల‌ను ఒప్పించి.. రుణాలు ఇచ్చేలా చేసింది.

అయితే.. ఇది స‌ఫ‌లీకృతం కావ‌డానికి.. మూడేళ్ల యినా.. ప‌డుతుంద‌ని.. ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు.. స‌ర్కారీ ఉద్యోగాలు నానాటికీ త‌గ్గిపోయి.. నోటిఫికేష‌న్లు రావ‌డ‌మే గ‌గనంగా మారింది. ఈ ప‌రిణామాల‌ను విశ్లేషిస్తూ.. కొంద‌రు ఆర్టిక‌ల్స్ రాస్తుంటే.. ఐఏఎస్ అధికారులు సైతం.. ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. సంక్షేమ ర‌థం ఒడిదుడుకులుగా సాగుతోంద‌ని వెల్ల‌డించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News