మోడీకి మంటపుట్టిస్తున్న ఐఏఎస్

Update: 2019-01-10 04:45 GMT
ప్రధాని మోడీ నిర్ణయాలు - పాలనపై ఓ బ్రూరోక్రాట్ పోరుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం ఏకంగా తను ఎంతో కష్టపడి సాధించిన ఐఏఎస్ ఉద్యోగాన్ని కూడా వదులకోవడానికి సిద్ధమవడం ఢిల్లీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించి బీజేపీ చేస్తున్న రాజకీయాలను చూసి సహించలేకే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి మోడీకి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు తాజాగా కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న ఐఏఎస్ షా ఫైజల్ సంచలన ప్రకటన చేశారు.

షా ఫైజల్.. ఆలిండియా సివిల్ సర్వీసెస్ లో టాప్ ర్యాంక్ సాధించిన తొలి కాశ్మీరీగా రికార్డులకెక్కారు. 2010 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వారు. యూపీఎస్సీ పరీక్షల్లో కాశ్మీర్ తరుఫున ఈయన గొప్ప విజయం సాధించి దేశవ్యాప్తంగా ఎంతో మందికి యువతకు - ఉద్యోగార్థులకు ఆదర్శంగా నిలిచారు. అయితే షా ఫైజల్ అన్యాయాలను - అక్రమాలను చూస్తూ ఊరుకునే స్వభావం కాదు. అప్పట్లో గుజరాత్ లో 46 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచార ఘటనను దునమాడుతూ మోడీ , బీజేపీ పాలనను తిడుతూ రేపిస్తాన్ అంటూ షా ఫైజల్ ఐఏఎస్ హోదాలో చేసిన ట్వీట్ కలకలం రేపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆయనకు షాకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.

ఇప్పుడు కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన పెట్టి ప్రజాస్వామ్యం కుదటపడకుండా బీజేపీ చేస్తున్న కుట్రలు - కుతంత్రాలు  - మిల్ట్రీ పాలనతో విసిగి వేసారిన షా ఫైజల్ తన రాష్ట్రం కోసం మోడీతో పోరాడాలని నిర్ణయించారు. తాను త్వరలోనే రాజకీయాల్లో వస్తున్నట్టు.. కాశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో చేరాలనుకుంటున్నట్టు తెలిపారు. కాగా షా ఫైజల్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. తమ పార్టీలో చేర్చుకుంటామని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం - నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్ధుల్లా తెలిపారు


Full View

Tags:    

Similar News