ఉగ్రవాదం ముప్పు మన దేశ రాజధానిని మరోమారు భయపెట్టింది. లండన్ తరహాలో ఢిల్లీలో ఉగ్రదాడులు జరగనున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించడంతో పాటుగా అన్ని పట్టణాల్లోనూ భద్రతను పెంచాలని ఢిల్లీ పోలీస్ కు చెందిన స్పెషల్ సెల్ రాష్ట్రాలకు ఈ సమాచారాన్ని చేరవేసింది. బస్ టర్మినల్స్ - విమానాశ్రయాలు - రైల్వే స్టేషన్లు - ఫైవ్ స్టార్ హోటళ్లు - మాల్స్ - మార్కెట్ల దగ్గర భద్రతను పెంచారు.
రంజాన్ పండుగ కంటే ముందే ఢిల్లీలో దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. సుమారు ఆరేడు మంది ఉగ్రవాదులు దాడులు చేసేందుకు ఢిల్లీలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైన ఉగ్రవాదులు దాడుల చేయవచ్చననే హెచ్చరికలను ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న భద్రతా బలగాలు తగు చర్యలు తీసుకోవాలని ఆయా వర్గాలకు సూచించాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/