జ‌య‌రాం హ‌త్య‌కేసు..హైద‌రాబాద్ ఏసీపీపై వేటు

Update: 2019-02-05 10:03 GMT
కోస్టల్ బ్యాంకు ఎండి జయరామ్ హత్య  ఉదంతం మ‌లుపులు తిరుగుతోంది. ఈ హ‌త్య కేసులో నిందితుడైన రాకేష్ రెడ్డి స‌త్సంబంధాల కార‌ణంగా ప‌లువురు ఇర‌కాటంలో ప‌డుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా - హైద‌రాబాద్‌ లోని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు పడింది. జ‌య‌రామ్ హ‌త్య‌కేసు నిందితుడు రాకేష్ రెడ్డి తో టచ్ లో ఉండటంపై అధికారులు విచారణ జరిపి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

జ‌య‌రామ్ మర్డర్ కేసులో కీలక నిందితుడి రాకేష్ రెడ్డి నేర చరిత్రపై పోలీసులు ఆరా తీశారు. హైదరాబాద్ లో మోసాలు - దందాలు సెటిల్ మెంట్లకు పాల్పడిన రాకేష్ రెడ్డి  - అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం చేయించడంలో దిట్ట. సినీనటిల చేత వ్యభిచారం చేయించినట్లు ఆరోపణలున్నాయి. ప్రముఖ హీరోయిన్ తో వ్యభిచారం చేస్తూ రాకేష్ రెడ్డి పట్టుపడ్డాడు.కొన్నాళ్ల క్రితం ఒక కేసులో రాకేష్ రెడ్డిని కూకట్ పల్లి పోలీసులు అరెస్ట్ చేసారు.కూకట్ పల్లి ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.80 లక్షలు రూపాయలను రాకేష్ రెడ్డి వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై విభిన్న కోణాల్లో ద‌ర్యాప్తు చేయ‌గా, రాకేష్ రెడ్డితో ఇబ్ర‌హీంప‌ట్నం ఏసీపీ మల్లారెడ్డి సాన్నిహిత్యం - పదే పదే మాట్లాడిన కాల్స్ పోలీసులు డీకోడ్ చేశారు.  ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలపై పూర్తి నిర్దారణకు వచ్చాకే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ ఏసీపీగా గాంధీ నారాయణను నియమించారు.  


Tags:    

Similar News