ప్రపంచ క్రికెట్ ఎప్పటికప్పుడు సరికొత్త నిబంధనలతో సరి కొత్త పుంతలు తొక్కుతూ కోట్లాది మంది క్రీడాభిమానులకు మజా ఇస్తోంది. క్రికెట్ పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఆ గేమ్ లో ఎన్ని మార్పులు వచ్చాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తాజాగా ఓ సరికొత్త నిబంధన త్వరలోనే క్రికెట్ లోకి అమల్లోకి రానుంది. తాజా ప్రపంచ కప్ టోర్నమెంట్ ఫైనల్లో బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ ను ప్రపంచ విజేతగా నిర్ణయించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి వివాస్పద అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదే టైంలో మరో వివాస్పద డీఆర్ ఎస్ ను కూడా సమీక్షించాలంటున్నారు. ఇక ఐసీసీ కొత్త నిబంధన కాంకషన్ సబ్ స్టిట్యూట్. 2014లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణాంతరం ఆస్ట్రేలియా క్రికెట్ ఈ నిబంధనను ఐసీసీ ముందు ప్రస్తావించింది. రెండు సంవత్సరాలుగా ఈ సరికొత్త నిబంధనపై చర్చలు నడుస్తున్నాయి.
ఐసీసీ 2017 నుంచి కాంకషన్ సబ్‌స్టిట్యూట్ నిబంధనలను దేశవాళీ టోర్నీలో అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టెస్టు చాంపియన్ షిప్ లో ఈ విధానానికి అనుమతినివ్వాలని భావిస్తోంది. ఇంతకంటే ముందుగా ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెన్ సీరిస్ లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కూడా చూస్తోంది.
కాంకషన్ అంటే ఏంటి...?
మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో ఏ ఆటగాడి తలకు అయినా బంతి తగిలితే కాసేపు అతడికి గింగరాలు తిరిగినంత పనువుతుంది. దీనినే కాంకషన్ అంటారు. ఆ టైంలో వచ్చే సబ్ స్టిట్యూట్ ఆటగాడు ఫీల్డింగ్ కే పరిమితమవుతాడే తప్పా.. అతడికి బ్యాటింగ్ - బౌలింగ్ చేసే ఛాన్స్ ఉండదు. ఇక కొత్తగా అమలయ్యే కాంకషన్ నిబంధన ప్రకారం సబ్ స్టిట్యూట్ గా వచ్చే ఆటగాడు ఫీలింగ్ తో పాటు బౌలింగ్ - బ్యాటింగ్ చేసేందుకు కూడా అనుమతిస్తారు. ఏ ఆటగాడు అయినా మ్యాచ్ ఆరంభంలోనే గాయపడితే అతడి బదులు వచ్చే ఆటగాడు బౌలింగ్ - బ్యాటింగ్ చేస్తే ఆ జట్టు మ్యాచ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుతుందన్న ఉద్దేశంతోనే ఐసీసీ ఈ సరికొత్త నిబంధనకు ఓకే చెపుతోంది.