అభిమానులకు పండుగే.. ప్రపంచ కప్ కు కొత్త జట్లు వచ్చేస్తున్నాయోచ్

Update: 2021-06-02 05:30 GMT
ఒక స్వీట్ న్యూస్ కే ఆనందపడిపోతాం. అలాంటిది వరుస పెట్టి స్వీట్ న్యూస్ ల బొనాంజాను ప్రకటించి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేలా చేసింది ఐసీసీ.  క్రికెట్ అభిమానులకు పండుగలాంటి వార్తల్ని వరుస పెట్టిన చెప్పిన వైనంతో వారికి ఒకేసారి రెండు మూడు పండుగలు కలిసి వచ్చేసినట్లుగా చేసింది. ఇందులో ముఖ్యమైనది ఇప్పటి వరకు ఒక పద్దతి పాడు లేకుండా సాగుతున్న టీ 20 ప్రపంచ కప్  టోర్నీని ఇకపై రెండేళ్లకోసారి నిర్వహించాలని డిసైడ్ చేశారు. అంతేకాదు.. రానున్న ఎనిమిదేళ్లకు సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్ ను వెల్లడించింది.

ఇప్పటివరకు అమలవుతున్న విధానానికి భిన్నంగా రానున్నరోజుల్లో పురుషులు ప్రపంచ కప్ టోర్నీతో పాటు.. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే జట్ల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది.  ఇప్పటివరకు 8.. 10 జట్లతో నిర్వహించిన వన్డే ప్రపంచ కప్ టోర్నీలో రానున్న రోజుల్లో 14 జట్లతో నిర్వహించనున్నారు. 2027 ప్రపంచ కప్ నుంచి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తేనున్నారు.

అంతేకాదు.. పురుషుల టీ 20 ప్రపంచ కప్ టోర్నీని ఏకంగా 20 జట్లతో నిర్వహిస్తామని.. ప్రతి టోర్నీలోనూ 55 మ్యాచులు ఉండనున్నాయి. ఇప్పటివరకు 16జట్లతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.  టీ 20.. వన్డే ప్రపంచ కప్ లు రెండింటిలోనూ జట్లు పెరగటంతో పాటు.. ఛాంపియన్ ట్రోఫిని మళ్లీ ప్రవేశ పెట్టున్నట్లుగా చెప్పింది. రానున్న రోజుల్లో వన్డే ప్రపంచ కప్ ను 2027.. 2031లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొనటంతో పాటు.. మొత్తం 54 మ్యాచుల్ని నిర్వహిస్తారు.

అదే సమయంలో టీ20 వర్డల్ కప్ ను 2024.. 2026.. 2028.. 2030లలో జరుగుతాయని.. ఒక్కో టోర్నీలో 55 మ్యాచులు ఉండనున్నాయి. పురుషుల ప్రపంచ కప్.. టీ 20 ప్రపంచ కప్ లోనే కాదు.. మహిళల ప్రపంచ కప్ లోనూ జట్ల సంఖ్యను పెంచనున్నారు. ఇంత పెద్ద ఎత్తున స్వీట్ న్యూస్ లతో క్రికెట్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News