వినూత్న ఆనందం: ఐసీసీ చ‌ర్య‌ల‌తో క్రికెట్ అభిమానులు ఖుషీ

Update: 2020-05-22 18:30 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌బ‌లడంతో క్రీడా కార్య‌క్ర‌మాల‌న్నీ నిలిచిపోయాయి. ముందే వేస‌వికాలం.. క్రీడా కార్య‌క్ర‌మాల‌కు అస‌లైన రోజులు. వీటికోసం క్రీడాభిమానులు ఎంతో మంది ఎదురుచూసేవారు. ఆ మ‌హ‌మ్మారి వ్యాప్తితో ఆ కార్య‌క్ర‌మాల‌న్నీ ర‌ద్ద‌వ‌డంతో తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. ఈ నేపథ్యంలో టీవీల్లో పాత క్రీడా పోటీలు మ‌ళ్లీ వేస్తున్నారు. ఈ క్ర‌మంలో క్రికెట్ అంటే విప‌రీత‌మైన పిచ్చి ఉన్న అభిమానుల కోసం ఐసీసీ, బీసీసీఐ ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక పోస్టు చేస్తూ క్రికెట్ అభిమానుల‌కు కొంత టైంపాస‌య్యేలా చేస్తున్నాయి. క్రికెట్ టోర్న‌మెంట్‌లో మ‌రుపురాని ఇన్నింగ్స్‌, మ్యాచ్‌లు, వ్య‌క్తుల జీవిత చ‌రిత్ర‌, క్రికెట్‌లో జ‌రిగిన విష‌యాలు త‌దిత‌ర పంచుకుంటున్నాయి. ఈ సంద‌ర్భంగా తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప‌లు ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తోంది.

లాక్‌డౌన్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పలు ఫొటోలు షేర్ చేసి.. ఎవరో గుర్తుపట్టారా? అంటూ అభిమానులను ప్ర‌శ్న‌లు వేస్తూ వారిలో ఆస‌క్తి పెంచుతోంది. ఇటీవల టీమిండియా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీల ఫొటో ట్వీట్ చేసింది. ఇంకా వెబ్‌సైట్‌లో క్రికెట్‌కు సంబంధించిన అన్నీ వివ‌రాలు, క‌థ‌నాలు అందుబాటులో ఉంచింది. ఈ క్ర‌మంలోనే అభిమానుల‌కు ఓ ప్రశ్న‌ను సంధించింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా '228' జెర్సీ నంబ‌ర్‌నే ఎందుకు వేసుకుంటాడో తెలుసా? అని ప్రశ్నించింది. పాండ్యా పరుగెడుతున్న ఫొటోను షేర్ చేసి అడిగింది. అయితే ఐసీసీ చేసిన ట్వీట్‌కు ఫ్యాన్స్ త‌మదైన శైలిలో స‌మాధానాలు ఇచ్చారు.

దీనికి అభిమానులు స‌మాధానం చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. వెంట‌నే స‌మాధానం ఇస్తూనే.. దాని వెనుక ఉన్న చ‌రిత్ర‌ను మొత్తం వివ‌రిస్తుండ‌డం విశేషం. ఒక్క భార‌తీయ క్రికెటర్ల‌నే కాదు.. అన్ని దేశాల జ‌ట్ల స‌భ్య‌లపై ప్ర‌శ్న‌లు వేస్తోంది. టోర్న‌మెంట్ల‌పై కూడా కొన్ని విశేషాలు పంచుకుంటోంది. క్రీడా పోటీలు లేకున్నా ఈ విధంగా సోష‌ల్ మీడియాలో క్రికెట్ అంశాల‌పై అభిమానులు సంతోషం పంచుకుంటున్నారు. స‌రైన స‌మాధానాలు చెప్పిన వారు తెగ ఖుషీ ప‌డుతున్నారు.
Tags:    

Similar News