ప్రపంచకప్ అంతిమ సమరం యావత్ క్రీడాలోకాన్ని ఉర్రూతలూగించింది. ఇంగ్లండ్ గెలిచింది. న్యూజిలాండ్ ఓడింది. అయితే గెలిచిన సంతోషం ఇంగ్లండ్ కు లేదు. మ్యాచ్ టైగా మారితే దొడ్డిదారిన బౌండరీల ఆధారంగా గెలవడంపై ఇంగ్లండ్ కెప్టెన్, ఫైనల్ లో గెలిపించిన స్టోక్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక ప్రపంచకప్ ఫైనల్ లో బౌండరీల ఆధారంగా గెలిచిన ఇంగ్లండ్ ది అసలు గెలుపే కాదని.. న్యూజిలాండ్ కు అన్యాయం జరిగిందని.. మాజీలు ,దిగ్గజాలు, యావత్ క్రీడాలోకం కోడై కూసింది. దీంతో ఐసీసీ ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ ఐసీసీ క్రికెట్ నిబంధనలను మార్చాలని డిసైడ్ అయ్యింది.
తాజాగా ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డెస్ ఈ మేరకు ప్రకటన చేశారు. 2009 నుంచి ఉన్న ఐసీసీ నిబంధనలు మార్చాలని నిర్ణయించామని.. మ్యాచ్ టై అయ్యి .. సూపర్ ఓవర్ కూడా సమం అయితే బౌండరీల ద్వారా విజేతను లెక్కించే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఐసీసీ పరిధిలో జరిగే అన్ని ఈవెంట్లో ఇదే నిబంధన ఉంది.. దీనిపై ప్రత్యామ్మాయాలు ఆలోచించి చెప్పాల్సిందిగా కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జియోఫ్ తెలిపారు.
భారత సీనియర్ క్రికెటర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో క్రికెట్ కమిటీకి ఐసీసీ నిబంధనలు మార్చే పని అప్పగించామని జియోఫ్ తెలిపారు. వచ్చే సంవత్సరం దీన్ని ఆమోదించి అమలు చేస్తామన్నారు. అనిల్ కుంబ్లే కమిటీ తీసుకునే నిర్ణయాలే భవిష్యత్ క్రికెట్ ను శాసించనున్నాయి. దీంతో కుంబ్లే కమిటీ ఎలాంటివి రూపొందిస్తాయనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.ఐసీసీ ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు చేపట్టడంపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.