క్రికెట్ చరిత్రలో దురదృష్టకర ఘటన!!

Update: 2015-10-19 17:52 GMT
క్రికెట్ చరిత్రలో చోటు చేసుకోని ఒక దురదృష్టకర ఘటన చోటు చేసుకుందా? విద్వేషాల కారణంగా ఏ మాత్రం సంబంధం లేని ఒక అంపైర్ ను వెనక్కి పిలిచేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరువురు (మహాత్మ గాంధీ.. మండేలా సిరీస్) శాంతిదూతల పేర్ల మీద జరుగుతున్న సిరీస్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ముంబయిలోని బీసీసీఐ కార్యాలయంలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న రచ్చ.. ఐసీసీని ఆలోచనల్లో పడేసింది. భారత్.. పాక్ మధ్య సిరీస్ గురించి సమాలోచనలు జరుపుతున్న సమయంలో బీసీసీఐ కార్యాలయాన్ని ముట్టడించిన శివసేన కార్యకర్తలు చేసిన రచ్చ నేపథ్యంలో.. ఐసీసీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.

దీంతో.. భారత్.. దక్షిణాఫ్రికా మధ్య సాగుతోన్న సిరీస్ లో అంపైర్లుగా వ్యవహరిస్తున్న వారిలో పాక్ జాతీయుడైన అలీమ్ దార్ ను వెనక్కి పిలిపిస్తూ నిర్ణయం తీసుకుంది. సిరీస్ లోని ఐదో వన్డేలో ఫీల్డ్ అంఫైర్ గా అలీమ్ దార్ అంపైరింగ్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే.. విద్వేషాల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా ఐసీసీ తాజా నిర్ణయం తీసుకుందన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News