ఐసీపీ ప్రయోగాత్మకంగా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఐసీపీ టెస్ట్ చాంపియన్ షిప్ యాషెన్ సీరిస్ నుంచి స్టార్ట్ అవుతోంది. గురువారం ఇంగ్లండ్ వేదికగా ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ - మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెన్ తొలి టెస్టు నుంచి ఈ మెగా టోర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ టెస్ట్ ఛాంపియర్ షిఫ్ ను అన్ని దేశాల మధ్య కాకుండా బహుల దేశాల మధ్య జరిగే టెస్ట్ సీరిస్ ల ద్వారానే విజేతను నిర్ణయించేలా చేసింది.
మ్యాచ్‌ల నిర్వహణ ఇలా....
రెండు సంవత్సరాల పాటు 9 దేశాల మధ్య 27 సీరిస్ లలో జరిగే 71 టెస్ట్ మ్యాచ్ ల ద్వారా ఈ విజేత నిర్ణయిస్తారు. దీనిలో భాగంగా ప్రతి జట్టు ఇంటా - బయటా మూడేసి సిరీస్ లు ఆడుతుంది. నిర్ణీత గడువు (2021 జూన్) వరకు పాయింట్ల పట్టికలో ఒకటి - రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఇంగ్లండ్ వేదికగా ఫైనల్ (72వ టెస్టు) ఆడతాయి. ఇక ఈ సీరిస్ లలో ప్రతి జట్టు కనిష్టంగా రెండు టెస్ట్ మ్యాచ్‌ల సీరిస్ లేదా ఐదు మ్యాచ్‌ల సీరిస్ లు ఆడతాయి.
పాయింట్లు ఎలా ఇస్తారంటే....
ఉదాహరణకు యాషెన్ సీరిస్ లో ఐదు మ్యాచ్ లు జరుగుతాయి. కొన్ని దేశాల మధ్య సీరిస్ లో రెండు మ్యాచ్ లే జరగవచ్చు. ఈ చాంపియన్ షిప్ రెండు అంచెల్లో జరుగుతుంది. (ఆగస్ట్ 2019–మార్చి 2021)ను మొదటి దశగా పేర్కొంటున్నారు. రెండో అంచెను జూన్ 2021–ఏప్రిల్ 2023 మధ్య నిర్వహిస్తారు. ప్రతి సీరిస్ కు 120 పాయింట్లు ఉంటాయి. ఐదు టెస్ట్ మ్యాచ్ లు జరిగితే మ్యాచ్ కు 24 పాయింట్లు - 4 టెస్టులు ఉంటే 30 పాయింట్లు - మూడు టెస్ట్ లు ఉంటే 40 పాయింట్లు - రెండు టెస్ట్ లు ఉంటే 60 పాయింట్లు కేటాయిస్తారు. మ్యాచ్ లు టై అయితే మొత్తం పాయింట్లను రెండు జట్లకు చెరి సగం పంచుతారు. ఇక డ్రా అయితే మొత్తం పాయింట్లలో ఒక్కో జట్టుకు 1 / 3 పాయింట్లు ఇస్తారు.
ఆడే జట్లు ఏంటంటే...
టాప్–9 (ఆస్ట్రేలియా - బంగ్లాదేశ్ - భారత్ - శ్రీలంక - వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా - పాకిస్తాన్ - ఇంగ్లండ్ - న్యూజిలాండ్) జట్ల మధ్య జరిగే సిరీస్ లే ఈ ఛాంపియన్ షిఫ్ పరిధిలోకి వస్తాయి. టెస్టు హోదా ఉన్నప్పటికీ అఫ్గానిస్తాన్ - ఐర్లాండ్ - జింబాబ్వే మధ్య జరిగే మ్యాచ్ లను చాంపియన్ షిప్ లో భాగంగా చూడటం లేదు. ఈ కప్ లో ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ (22) ఎక్కువ మ్యాచ్ లు ఆడుతోంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా (19) - భారత్ (18) దాని తర్వాత ఎక్కువ టెస్టులు ఆడతాయి.
శ్రీలంక - పాకిస్తాన్ లకు తక్కువగా 13 మ్యాచ్ లు మాత్రమే ఆడే వీలుచిక్కింది. టోర్నీలో ఈ రెండు జట్లతో భారత్ కు సిరీస్ లు లేవు. నవంబర్ లో ఇంగ్లండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య సీరీస్ మాత్రం ఈ ఛాంపియన్ షిప్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక స్లో ఓవర్ రేటుకు ఇప్పటి వరకు టెస్టులలో ఎలాంటి నిబంధనలు లేవు. అయితే ఇప్పటి నుంచి మాత్రం ప్రతి మ్యాచ్ కు జట్టుకు ఇచ్చే పాయింట్లలో రెండు కట్ చేస్తారు. ఫైనల్ మ్యాచ్ ఐసీసీ ఆధ్వర్యంలో ఇంగ్లండ్ వేదికగా జరుగుతుంది. ఫైనల్ డ్రా అయితే ఇరు జట్లను ఛాంపియన్లుగా ప్రకటిస్తారు. ఇక నుంచి ప్రతి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా జరగడం పక్కా.