ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ సరికొత్త సేవల్లోకి ప్రవేశించనుంది. తన వెబ్ సైట్.. మొబైల్ యాప్ ద్వారా రైల్వే ఈ బుకింగ్ కు అవకాశం ఇవ్వనుంది. ఈ మేరకు రైల్వే ఈ టికెట్ ఫ్లాట్ ఫాంతో బ్యాంక్ తాజాగా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీ వెబ్ సైట్ ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే వీలు కలుగుతుంది.
దీంతో.. ఐసీఐసీఐ బ్యాంక్ రైల్వే సేవల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు అయ్యింది. ఇప్పటివరకూ ఐఆర్ సీటీసీలో రిజిష్టర్ అయిన సభ్యులు రైల్వే రిజర్వేషన్లు చేసుకునే వీలు ఉంది. దీనికి ప్రత్యామ్నయంగా ఐసీఐసీఐ కానుంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. రైల్వే టిక్కెట్ల బుకింగ్ కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులే కాదు.. ఏ బ్యాంక్ ఖాతాదారులైనా టిక్కెట్టు బుక్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నారు.
కేవలం టిక్కెట్లు బుకింగ్ చేసుకోవటమే కాదు.. రద్దు చేసుకోవటం.. పీఎన్ ఆర్ స్టేటస్ తెలుసుకోవటం లాంటి పలు సేవల్ని కూడా ఐసీఐసీఐ బ్యాంకు సైట్ నుంచి తెలుసుకునే వీలుంది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ సేవలతో మరింత మందికి తాము దగ్గర కావొచ్చని ఐసీఐసీఐ భావిస్తోంది. వెబ్ సైట్.. మొబైల్ యాప్ తో పాటు.. ప్రీపెయిడ్ డిజిటల్ వాలెట్ ద్వారా కూడా రైల్వే టిక్కెట్ల బుకింగ్ చేసుకునే వెసులుబాటును ఐసీఐసీఐ కల్పించనుంది.