తెలంగాణ రాష్ట్రంలో వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతుంది. మరో ముఖ్యంగా గత రెండురోజుల నుంచి రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ పై ఐసీఎంఆర్ హైరదబాద్ లో సర్వే నిర్వహించనుంది. హైదరాబాద్ లోని 5 కంటైన్ మెంట్ జోన్లలో రెండు రోజులపాటు సర్వే నిర్వహిస్తారు. ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రా ప్రాంతాల్లో 10 ప్రత్యేక టీమ్ ల ద్వారా సర్వే చేపట్టనున్నారు.
ఒక్కో జోన్ లో రెండు టీంలు చొప్పున మొత్తం పది టీంలు కరోనా కేసులపై .. వాటి లక్షణాలపై.. లక్షణాలు లేకుండా బయటపుడుతున్న కేసులపై సర్వే చేస్తారు. సర్వే చేసిన నివేదికను ఐసీఎంఆర్.. కేంద్ర ఆరోగ్యశాఖకు అందించనుంది. ఇప్పటికే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఐసీఎమ్ ఆర్ సర్వే పూర్తి చేసింది. వైరస్ ట్రాన్స్‌మిషన్ ఏమైనా జరిగిందా..! ఎవరికైనా వైరస్ సోకిన తర్వాత యాంటీ బాడీస్ పెరిగాయా..? లాంటి అంశాలను పరిశీలిస్తూ ఈ సర్వేను నిర్వహించనున్నారు. ఈ సర్వేల నివేదికల ఆధారంగా కేంద్రం లాక్ డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటుంది.
ఇకపోతే , నిన్న ఒక్కసారిగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరిగాయి. ఏకంగా 117 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో తెలంగాణ వాసులు 66 మంది ఉన్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారు 49 మంది, ఇద్దరు వలస కార్మికులకు వైరస్ సోకింది. మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 వేల 256 మంది కరోనా బారిన పడ్డారు. తెలంగాణకు చెందిన కేసులు 1, 908 ఉండగా, వలస దారులకు సంబంధించనవి 175, సౌదీ అరేబియా నుంచి వచ్చినవి 143 కేసులు, సడలింపులు ఇచ్చాక విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 30 కేసులు నమోదయ్యాయి.