సూర్యపేటలో కల్నల్‌ సంతోష్‌ బాబు విగ్రహావిష్కరణ !

Update: 2021-06-15 11:04 GMT
దేశం కోసం వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబు విగ్రహ ఏర్పాటు, కోర్టు చౌరస్తాకు సంతోష్‌ బాబు పేరు పెడ్తామని కుటుంబ సభ్యులకు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పు డు కార్యరూపం దాల్చబోతోంది. సూర్యాపేట కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు పేరు పెట్టారు. ఈక్రమంలో సంతోష్ బాబు విగ్రహాన్ని చౌరస్తాలో ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఆవిష్కరణ కోసం సంతోష్ బాబు విగ్రహం సూర్యాపేట చేరుకుంది. ఈ క్రమంలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేట చౌరస్తాలో ఆవిష్కరించటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

2020లో చైనా, ఇండియా ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. గల్వాన్ లోయలో చైనా ఆర్మీని నిలువరించటంలో సంతోష్ బాబు వీరోచితంగా పోరాడారు. సంతోష్ బాబుతో సహా ఇండియన్ ఆర్మీ చైనా ఆర్మిని నిలువరించటంతో అత్యంత కీలకంగా వ్యవహరించిన విషయంతెలిసిందే. ఈ క్రమంలో సంతోష్ బాబు వీరమరణం పొందారు. తెలంగాణ ముద్దు బిడ్డ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ స్వయంగా పరామర్శించారు. అంతేకాకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు ఉద్యోగాన్ని కూడా ఇచ్చి గౌరవించింది.

అలాగే అతని కుటుంబానికి హైదరాబాద్ లో ఓ స్థలాన్ని కూడా కేటాయిచిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కల్నల్ సంతోష్ బాబుకు ఘన నివాళిగా..అతనికి ఇచ్చే అత్యంత గౌరవప్రదంగా సూర్యాపేటలోని చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణకు..సూర్యాపేట గడ్డకు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేలా సంతోష్ బాబు విగ్రహం ఆవిష్కరణ కానుంది. ఈ విషయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కార్యక్ర మం ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. కోర్టు చౌరస్తాకు కల్నల్‌ సంతోష్‌ బాబు పేరును నామ కర ణం చేస్తారని తెలిపారు.
Tags:    

Similar News