గడిచిన కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు సంచలనంగా మారుతున్నాయి. మొన్న అంతర్వేది.. ఆ తర్వాత రామతీర్థం.. రాజమండ్రిలోని ఆలయాలపై దాడి జరిగిన వైనం ఇప్పటికే పెను దుమారాన్ని రేపితే.. తాజాగా మరో గుడిపై కూడా దాడి జరిగినట్లుగా ప్రచారం మొదలైంది. కర్నూలు జిల్లాలోని కోసిగి మండలంలోని మర్లబందలోని ఆలయంపై దాడి జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది.
అక్కడి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల విగ్రహాల ధ్వంసం జరిగినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. విగ్రహాల్ని ధ్వంసం చేసి.. హుండీ ఎత్తుకెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ వార్తల్లో అస్సలు నిజం లేదని.. ఉత్త ప్రచారమేనని చెబుతున్నారు. మీడియాలోని కొన్నింటిలోనూ.. సోషల్ మీడియాలోనూ ఈ తరహా వార్తలు వస్తున్నాయి.
దీంతో.. అలెర్టు అయిన కర్నూలు జిల్లా పోలీసులు ప్రచారం జరుగుతున్న ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడి ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే.. తమ ఆలయంలో అలాంటి దాడి ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ అసత్య ప్రచారాలని.. ఇలాంటివి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని నమ్మొద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అసత్య ప్రచారాలకు భావోద్వేగాలు ఏ మాత్రం మంచిది కాదని పోలీసులు తెలుపుతున్నారు. సో.. ఆలయ ధ్వంసం లాంటివి పేర్కొంటూ వచ్చే పోస్టుల్ని క్రాస్ చెక్ చేసుకోకుండా ఫార్వర్డ్ చేస్తే.. అనవసరమైన చిక్కుల్లో పడే ప్రమాదం ఉందన్నది మరర్చిపోకూడదు.