ఇటీవల ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో గడప గడపకు మన ప్రభుత్వం మీద సమీక్ష జరిగింది. అయితే ఈ సమీక్షలో జగన్ వద్దకు చేరిన నివేదికలు అన్నీ పెర్ఫెక్ట్ అని అంతా అనుకుంటున్నారు. కానీ ఒక ఎమ్మెల్యే మీద ఏకంగా జగన్ కే తప్పుడు సమాచారం ఇచ్చారని అంటున్నారు.
ఆ ఎమ్మెల్యే ఏకంగా 41 సచివాలయాలు తిరిగితే 27 మాత్రమే తిరిగారు అని రిపోర్టు లో ఉందిట. దాంతో సదరు ఎమ్మెల్యే గారికి జగన్ షరా మామూలుగా క్లాస్ పీకారని అంటున్నారు. ఈ రకమైన తప్పుడు రిపోర్టుతో తనకు సీటు వస్తుందో రాదో అన్న ఆందోళనతో ఆయన ఉన్నారట.
తనను తప్పించాలనే జగన్ కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అని ఆ ఎమ్మెల్యే మధపడుతున్నారట. ఇక ఆ ఎమ్మెల్యే బీసీ అని చెబుతున్నారు. దాంతో తనను ఎదగకుండా తొక్కేయాలనే జగన్ వద్ద తప్పుడు రిపోర్ట్ తో క్లాస్ ఇప్పించేలా చేశారని కూడా మండిపోతున్నారుట.
ఈ రకంగా హై కమాండ్ కి చెందిన ఒక పెద్ద మనిషి కావాలనే తప్పుడు రిపోర్ట్ ఇప్పించారని అనుమానిస్తున్నారు. ఇలా తన ఒక్కడి మీదనే కాకుండా చాలా మంది ఎమ్మెల్యేల మీద ఆ పెద్ద మనిషే తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు అని అంటున్నారుట. ఈ విషయం మీద చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గుర్రుగా ఉన్నారు. సదరు పెద్ద మనిషి వల్ల తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది అని అంటున్నారుట.
తొందర్లో జగన్ని కలసి తాము తిరిగిన వాటికి సంబంధించి వీడియోలు, ఫోటోలు కూడా ఆయనకే చూపించాలని, తమ మీద వస్తున్న తప్పుడు రిపోర్టుల మీద జగన్ కే వివరించాలని ఆలోచిస్తున్నారుట. ఇదిలా ఉంటే వైసీపీలో ఈ సర్వేల మీద కూడా చర్చ సాగుతోంది.
అస్మదీయులు అయితే ఒక విధంగా తస్మదీయులు అయితే మరో విధంగా సర్వే నివేదికలు వస్తున్నాయి అని అంటున్నారు. జగన్ కేవలం సర్వేల మీద రిపొర్టుల మీద ఆధారపడుతున్నారని దాంతో వాటినే తప్పుగా చూపించి తాము తొక్కేయాలనుకుంటున్న వారి విషయంలో ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. హై కమాండ్ అంటే తానే అని చెప్పుకునే ఒక పెద్ద మనిషి వైఖరి ఈ విధంగా మరో సారి చర్చకు వస్తోంది. ఆయన కోరి ఇవన్నీ చేయిస్తున్నారు అని అంటున్నారు.
మరి ఈ విషయంలో చూస్తే జగన్ కి ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న ఆ పెద్ద మనిషి ఎవరు, ఆయన అంత పవర్ ఫుల్లా. ఆయన మాట జగన్ కి అంత గురా. ఇక ఆయనే మొత్తం వైసీపీని తనతో పాటే తిప్పుకుంటున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఈ విధంగా కనుక వ్యవహారం ఉంటే అది అటు మంచి ఎమ్మెల్యేలు పనిచేసే వారికి కూడా ఇబ్బందే. అలాగే సమర్ధత కలిగిన నాయకులు పార్టీకు దూరం అవుతారని అంటున్నారు. అదే టైం లో ఈ రిపోర్టుల మీద జగన్ ఆధారపడి క్లాస్ తీసుకోవడం ద్వారా వారిని వదులుకోవాల్సి వస్తుదని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ కి ఎమ్మెల్యేలకు మధ్యన గ్యాప్ బాగా ఉందని మరో మారు తెలుస్తోంది
మధ్యలో వ్యక్తులు నివేదికలు, సర్వేలు, తప్పుడు రిపోర్టులు ఇలా ఇవన్నీ అంతరాన్ని కలుగచేస్తే ఏదో నాటికి ఈ అగాధం ఇంకా పెరిగిపోయి అది అగ్ని పర్వతంలా బద్ధలైతే వైసీపీకి ఎన్నికల వేళ బాగా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా తప్పుడు రిపోర్టులు తమవి అని అనుకుంటున్న వారు అంతా జగన్ని కలిస్తేనే సమస్యకు చెక్ పడుతుందని, మధ్యలో పెద్ద మనుషులు ఎవరున్నా తేలిపోతుందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.