ఖాళీగా ఉన్న రోడ్డు మీద దూసుకెళుతున్న కారుకు హటాత్తుగా బ్రేకులు పడే సీన్ ఒకటి ఉంటుంది. అదే.. ఒక పడుచు పిల్ల లిఫ్టు కోసమని వేలు చూపిస్తే చాలు.. చాలామంది కాళ్లు బ్రేకుల మీదకు వెళతాయి. అలాంటి పనులు చేసే వారు ఈ ఉదంతం గురించి తెలిస్తే.. తమ తీరును మార్చుకోవటం ఖాయం. ఇంతకూ ఏం జరిగిందంటే..
విజయనగరం జిల్లాకు చెందిన లక్ష్మీ అనే మహిళ వ్యవసనాలకు బానిసైంది. తన అవసరాల్ని తీర్చుకోవటానికి ఆమె వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. చక్కగా రెఢీ అయి.. రోడ్డు మీద నిలబడటం.. కార్లు ఏవైనా వస్తే లిఫ్టు అడిగేది. ఏదో అవసరం ఉందని సాయం చేసే వారు పలువురు కార్లను ఆపేవారు.
కారులో కాసేపు ప్రయాణించినంతనే తాను కోరినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేది. కాదు కూడదంటే.. అత్యాచార యత్నం చేయబోయారన్న కేసును పెడతానని వార్నింగ్ ఇచ్చేది. ఏదో అమ్మాయికి లిప్టు ఇద్దామని భావించిన వారందరికి ఇలాంటి షాకులు తరచూ జరిగేవి. తమకు ఎదురైన చేదు అనుభవాల్ని ఫిర్యాదు రూపంలో పోలీసులకు ఇస్తే.. తమ పరువు ఎక్కడ పోతుందన్న భయాందోళనతో ఎవరికి వారు కామ్ గా ఉండేవారు. తాజాగా ఒక బాధితుడు ధైర్యం చేసి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించటం.. ఆ వెంటనే వల పన్నిన విజయనగరం పోలీసులు ఈ కిలేడీని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా.. ఈ అమ్మడు చిన్న చిన్న నేరాలు ఇప్పటికే పలుమార్లు పాలుపడిందని.. ఇప్పుడు లిప్టు పేరుతో సాయం పొందే క్రమంలో చాలామందిని ఇదే రీతిలో బెదిరించి సొమ్ము చేసుకునేదన్న వైనం తెలుసుకున్న పోలీసులు సైతం విస్మయానికి గురవుతున్నారు. కేసు కట్టి ఆమెను రిమాండ్ కు తరలించారు. సో.. రోడ్డు మీద లిఫ్టు అడిగే అమ్మాయిలకు సాయం చేసే ముందు జర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.