నాకేమైనా హాని జరిగితే ఆ ఎంపీ, ముఖ్యమంత్రే కారణం: పోలీసులకు దస్తగిరి ఫిర్యాదు!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల్లో ఒకడైన దస్తగిరి అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. అప్రూవర్ గా మారడంతో సీబీఐ కోర్టు అతడికి బెయిల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా పులివెందులలోనే దస్తగిరి ఉన్నాడు.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఇచ్చిన డబ్బులకు అమ్ముడుపోయిన దస్తగిరి తమ పై ఆరోపణలు చేస్తున్నాడని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి మండిపడుతున్నారు. తెలంగాణ హైకోర్టులో ఈ మేరకు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దస్తగిరి చెప్పిన మాటలను ఎల్లో మీడియా పతాక శీర్షికల్లో ప్రచురిస్తోందని తప్పుబట్టారు. ఒక హంతకుడు తాను ఎలా చంపానో చెబితే దాన్ని ప్రచురించటం ఏమిటని సజ్జల మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో తనకు ప్రాణ హాని ఉందని వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన దస్తగిరి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనకు సీఎం జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉందని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అదనపు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు. ఎంపీ అవినాష్ రెడ్డి పదే పదే తన పై మీద దుష్ప్రచారం చేస్తున్నారని దస్తగిరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవినాష్ రెడ్డి తనను రెచ్చగొట్టే విధంగా తనపై తప్పుడు అభియోగాలు మోపుతున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో తన ప్రాణానికి ఏదైనా హాని జరిగితే అది ఎంపీ అవినాష్ రెడ్డి, సీఎం జగన్ మోహన్ రెడ్డి కారణం అంటూ దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు రక్షణ కల్పించాలంటూ కడప జిల్లా ఎస్పీకి, కర్నూలు డీఐజీకి, సీబీఐ ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేశాడు
కాగా తన తప్పు తెలుసుకున్నాను కాబట్టే అప్రూవర్‌గా మారినట్లు తాజాగా పలు మీడియా సంస్థలకిచ్చిన ఇంటర్వ్యూల్లో దస్తగిరి వెల్లడించిన సంగతి తెలిసిందే. కేసుకు సంబంధించి ప్రతీ సాక్ష్యం సీబీఐ దగ్గర ఉందని బాంబుపేల్చాడు. ఇప్పటికే పాత్రధారులం చిక్కామని.. త్వరలోనే సూత్రధారులు కూడా బయటకు వస్తారని దస్తగిరి హాట్ కామెంట్స్ చేశాడు. వివేకాను ఎవరు చంపారో పులివెందులలో టీ షాప్‌కు వెళ్లి అడిగినా చెబుతారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.