ఏపీలో బీజేపీ... పెద్దిరెడ్డిని కంట్రోల్ చేస్తే.. వైసీపీ ప‌రిస్థితేంది?

Update: 2022-08-03 07:19 GMT
రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు.. అవ‌కాశం కోసం.. నాయ‌కులు.. అధికారం కోసం.. పార్టీలు.. ఎలాంటి వ్యూహా లనైనా అనుస‌రిస్తున్న ప‌రిస్థితి ఉంది. అధికారం ద‌క్కించుకునేందుకు..కేంద్రంలోని బీజేపీ వేయ‌ని పాచిక లేదు.. అనుస‌రించ‌ని వ్యూహం లేదు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య చిచ్చు పెట్టి.. త‌మ‌వైపు తిప్పుకొని.. స‌ర్కారు ఏర్పాటు చేసిన ప‌రిస్థితి తాజాగా మ‌హారాష్ట్ర‌లో మ‌న క‌ళ్ల ముందే జ‌రిగింది. ఇంత‌టి ఘోరం జ‌రుగుతున్నా.. ఎవ‌రూ ఆప‌లేక పోయారు.

నేరుగా.. త‌న‌కు మోడీ, అమిత్‌షాలే స‌హాయం చేశార‌ని.. వారే త‌న‌ను న‌డిపించార‌ని.. అసెంబ్లీ సాక్షిగా.. అక్క‌డి సీఎం ఏక్‌నాథ్ షిండేచెప్పిన త‌ర్వాత కూడా.. దేశంలో ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు రాలేదు. ఇక‌, ఈ నేప‌థ్యంలో మోడీ, షాలు త‌లుచుకుంటే.. ఆపేదెవ‌రు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ... వైసీపీకి తెర‌చాటున స‌హ‌క‌రించింద‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలోనే టీడీపీని అడుగ‌డుగునా.. కంట్రోల్ చేసింది.

టీడీపీ కీల‌క నాయ‌కులుగా ఉన్న సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌ ను ఇంకా జాబితాలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రిని బీజేపీ హైక‌మాండ్ కంట్రోల్ చేసింది. టీడీపీకి ఆర్థిక ద‌న్నుగా నిల‌వ‌కుండా.. చూసింది. రాష్ట్ర వ్యాప్తంగా.. ఎలాంటి.. ఆర్థిక విష‌యంలోనూ.. సాయం అంద‌కుండా చూసింది. ఇది.. ఎంత‌గా సాగిందంటే.. మంగ‌ళ‌గిరి లో నారా లోకేష్ పోటీ చేసిన చోట సైతం ఎక్కువ పంచ‌నీయ‌కుండా చూశారు.  అంతేకాదు.. టీడీపీ రాజ్య‌స‌భ ఎంపీలు అంద‌రూ.. బీజేపీలో చేరిపోయారు.

అప్ప‌టి వ‌ర‌కు వారిపై ఉన్న కేసులు... సీబీఐ, ఈడీ వేధింపులు సైతం.. లేకుండా పోయాయి.. లేదా నెమ్మ దించాయ‌నే చెప్పాలి. ఫ‌లితంగా ఎన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేసినా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌సుపు-కుంకుమ వంటి ప‌థ‌కాల‌తో డ‌బ్బులు పంచినా.. టీడీపీ ప‌రిస్థితి ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం అయింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు.. 2024 నాటికి.. వైసీపీ పైనా.. బీజేపీ ఇలాంటి మంత్ర‌మే ప్ర‌యోగిస్తే.. ఏంటి ప‌రిస్థితి? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎలాగంటే.. 2024 ఎన్నిక‌ల నాటికి.. వైసీపీలో ఉన్నకీల‌క నాయ‌కుడు, సీనియ‌ర్ నేత‌, పెద్దిరెడ్డి రామ‌చం ద్రారెడ్డిని త‌మ‌వైపున‌కు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేసి.. బీజేపీ క‌నుక ఆయ‌న‌ను కంట్రోల్ చేస్తే.. వైసీపీ ప‌రి స్థితి ఏంటి? అనేది.. పెద్ద ఎత్తున టీడీపీలోను, వైసీపీలోను.. చ‌ర్చ జ‌రుగుతోంది.  పెద్దిరెడ్డి కుటుంబానికి, వైసీపీకి మ‌ధ్య అవినాభ సంబంధం ఉంది. అదేస‌మ‌యంలో రాయ‌ల సీమ‌లోని రెండు జిల్లాల‌ను పెద్దిరెడ్డి త‌న క‌నుస‌న్నల్లో న‌డిపిస్తున్నారు.

అదేస‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయ‌కుల‌ను ఆయ‌న అదుపులో పెట్టుకున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో పెద్దిరెడ్డిని త‌మ‌వైపు తిప్పుకొనేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తే.. వైసీపీని నియంత్రించ‌డం.. ఖాయ‌మ‌నే వాద‌న కొన్ని రోజులుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. పైగా.. పెద్దిరెడ్డి సౌమ్యుడు.. అంద‌రి మాటా వినేవాడు.. అనే పేరు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. ఏపీలో అన్నీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ చూసుకుంటోంది. ఎక్క‌డ ఉప ఎన్నిక జ‌రిగినా.. ఆయ‌నే పార్టీకి దిక్కు, మొక్కు అన్న‌ట్టుగా మారారు. ఈ నేప‌థ్యంలో పెద్దిరెడ్డిని అడ్డు పెట్టి.. బీజేపీ వ్యూహత్మ‌కంగా అడుగులు వేస్తే.. వైసీపీకి చిక్కులు త‌ప్ప‌వ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. 
Tags:    

Similar News