రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం మరోసారి కొత్త గా రూల్స్(మార్గదర్శకాలు) విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్త నిబంధనలు జారీ చేసింది.
నూతన మార్గదర్శకాల ప్రకారం.. పౌరులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే.. 100 రూపాయల జరిమానా విధిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విషయంలో వ్యాపార సముదాయాలకు మాత్రం భారీ హెచ్చరికలు చేసింది.
అంతేకాదు, మాస్కు లేని వారిని దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతి స్తే.. సదరు యాజమాన్యానికి రూ.10 వేల నుంచి 25 వేల మేర జరిమానా విధించాలని ఆదేశించింది.
ఉల్లంఘనలు జరిగిన వ్యాపార, వాణిజ్య సంస్థలను 2 రోజులపాటు మూసివేసేలా నిర్ణయించింది. దుకాణాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో జరిగే ఉల్లంఘనలను 8010968295 నెంబరుకు వాట్సప్ ద్వారా తెలియచేయాలని ప్రభుత్వం సూచించింది.
ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలు జరిగితే.. విపత్తు నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఈ అంశాలను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. వాస్తవానికి పొరుగు రాష్ట్రం తెలంగాణ ఇప్పటికే మాస్కులు ధరించనివారిపై కొరడాఝళిపిస్తున్న విషయం తెలిసిందే. రూ.1000 చొప్పున జరిమానా విధిస్తోంది. ఇక, ఏపీలో మాత్రం ఇది 100గా ఉండగా.. వ్యాపారాలు చేసేవారిని ఎక్కువగా టార్గెట్ చేయడం గమనార్హం. దేశంలో ఒమిక్రాన్ కేసుల భయంతో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం హర్షించదగిందే అంటున్నారు పరిశీలకులు.