చిలికి చిలికి గాలివానలా మారనుంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారం. పీఆర్సీ పెంచాలంటూ కోరిన ఉద్యోగులకు షాకిస్తూ.. ఇప్పటికే వస్తున్న జీతాల కంటే తక్కువగా పీఆర్సీని ఫిక్సు చేశారని.. మారిన హెచ్ఆర్ తో పాత జీతం కంటే కొత్త జీతం తక్కువగా రానుందంటూ ఉద్యోగులు వాదిస్తున్నారు.
ఒకవేళ అదే నిజమైతే.. ప్రభుత్వం మీద పడే రూ.10వేల కోట్ల అదనపు భారం మాటేమిటి? అంటూ ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి ఉద్యోగ సంఘాల వారు ఇస్తున్న వివరణ.. మొత్తంగా రెండు వర్గాల మధ్య ఇప్పుడు దూరం పెరిగింది.
పీఆర్సీ ప్రకటన వేళ.. చప్పట్ల మోత మోగించిన ఉద్యోగ సంఘాల నేతలు.. ఇప్పు సమ్మె సైరన్ మోగించటమే కాదు.. ఉద్యోగుల తరఫు పోరాడేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు నోటీసు కూడా ఇచ్చేసిన వారు.. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం నుంచి తాము పోరు షురూ చేస్తామని చెబుతున్నారు.
సమ్మెకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించారు. ఇలాంటి వేళ.. మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం.. ప్రభుత్వం వద్దకు చర్చకు రావాలని ఆహ్వానించారు.
సమ్మె కానీ చేస్తే రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగులు పనుల నుంచి తప్పుకున్నట్లు అవుతుంది. అదే జరిగితే.. రాష్ట్రంలో పాలన స్తంభించిపోయే పరిస్థితి. ఎప్పుడూ పెంచిన జీతాలు ఇవ్వమని కోరే ఉద్యోగులు.. రోటీన్ కు బిన్నంగా కొత్త జీతాలు వద్దు.. పాత జీతాలే ముద్దు అంటూ చేస్తున్న వినతి ఇప్పుడు కొత్తగా మారింది. అందరికి ఆమోదయోగ్యమైన సీపీఎస్ విధానం కాకుండా ఓపీఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
ఎల్లకాలం సమ్మె చేస్తూ ఉండరు కదా? ఎప్పటికైనా చర్చకు రావాల్సిందే కదా..? ప్రభుత్వంతో చర్చకు రావాలని మంత్రి పేర్ని నాని ఉద్యోగ సంఘాలను కోరుతున్నారు. చర్చకు రావాలని పిలిచే మంత్రివర్యులు.. ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెబుతున్న కొత్త పీఆర్సీకి సంబంధించిన జీవో అమలును ఆపేస్తే సమస్య పరిష్కారం అవుతుంది కదా?
ఓవైపు జీవోను జారీ చేసి.. అమల్లోకి తీసుకొచ్చేస్తూ.. మరోవైపు చర్చకు రమ్మని చెప్పటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. పేర్ని నాని చెప్పినట్లు.. ఎప్పటికైనా ఉద్యోగ సంఘాలతో మాట్లాడాల్సి ఉన్న ప్రభుత్వం.. అదేదో జీవోను నిలిపివేస్తే.. సమస్యకు పరిష్కారం లభించటంతో పాటు.. పాత జీతాలతో సమస్యకు పరిష్కారం లభిస్తుంది కదా? అదేమీ చేయకుండా చర్చకు రమ్మంటే ఉద్యోగులు ఎందుకొస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది.