గోరంట్ల మాధ‌వ్‌ను స‌స్పెండ్ చేయ‌క‌పోతే..రోజూ టీడీపీ ట్రోల్ చేస్తుందా?

Update: 2022-08-05 05:39 GMT
ఏపీ రాజ‌కీయాలు ఒక్కసారిగా యూట‌ర్న్ తీసుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయంగా వైసీపీ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. వ‌చ్చిన విప‌క్ష పార్టీల‌కు ఇప్పుడు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ రూపంలో ప‌దునైన ఆయుధం ల‌భించింది. ఆయ‌న చేసిన న్యూడ్ వీడియోకాల్ రాష్ట్రంలోనే కాకుండా.. దేశ‌వ్యాప్తం గా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే అవ‌కాశం వ‌చ్చింది. రాజ‌కీయాల్లో ఇది కామ‌న్ కూడా!

గ‌తంలో టీడీపీ మంత్రులుగా ఉన్న కే. జ‌వ‌హ‌ర్‌, ఆదినారాయ‌ణ‌రెడ్డిలు చేసిన కామెంట్ల‌ను అప్ప‌ట్లో ప్ర‌తిప క్షంగా ఉన్న వైసీపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది. వారు చేసిన వ్యాఖ్య‌ల‌ను రాజ‌కీయంగా మార్చు కుని.. టీడీపీ స‌ర్కారును ముప్పుతిప్ప‌లు పెట్టింది. ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా వాటిని వైసీపీ అనుకూల మీడి యా ప్ర‌సారం చేసింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అందివ‌చ్చిన అవ‌కాశాన్ని టీడీపీ కూడా.. త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం స‌హ‌జ‌మే.

మ‌రీ ముఖ్యంగా గోరంట్ల విష‌యం.. మ‌హిళ‌ల‌తో ముడిప‌డిఉన్న నేప‌థ్యంలో దీనిని ఆకోణంలోనే ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే అవ‌కాశం టీడీపీకి మెండుగా క‌నిపిస్తోంది. త‌మ‌ది మ‌హిళా ప‌క్ష పాత ప్ర‌భుత్వమ‌ని ప‌దే ప‌దే చెబుతున్న వైసీపీని ఇరుకున పెట్టేలా టీడీపీ వ్యూహ ర‌చ‌న‌లు చేయ‌డం స‌హ‌జ‌మే.

సో.. దీని నుంచి త‌ప్పించుకునేందుకు ఇప్పుడు వైసీపీకి రెండే మార్గాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి ఎంపీని.. త‌క్ష‌ణ‌మే ఆ ప‌ద‌వి నుంచి రాజీనామా చేయించాలి. ఇలా చేయ‌డం ద్వారా.. ఇప్పుడు చెల‌రేగిన మంట‌ల‌ను అంతో ఇంతో అదుపు చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

ఇక‌, మ‌రో మార్గం పార్టీ నుంచి ఆయ‌న‌ను పూర్తి గా బ‌హిష్క‌రించ‌డం. ఇదే చేస్తే.. వైసీపీ చాలా వ‌రకు బ‌య‌ట ప‌డుతుంది. పైగా.. వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు కూడా ఇదే స‌మాధానం అవుతుంది. అలా కాకుండా.. ``మా వాడు.. ఏదో ఆవేశంలో చేశాడు. ఎవ‌రో కావాల‌ని ఇరికించారు`` అంటూ.. మెత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తే.. మాత్రం .. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఎట్టి ప‌రిస్థితిలోనూ.. ఊరుకోదు. దీనిని ఎంత వ‌ర‌కు తీసుకువెళ్లాలో.. అంతా చేయ‌డం తోపాటు.. ముఖ్యంగా మ‌హిళ‌ల‌తో ఉద్య‌మాలు కూడా చేయించే అవ‌కాశం ఉంటుంది.

అదేస‌మ‌యంలో డిజిట‌ల్ మాధ్య‌మాల ద్వారా.. మ‌రింత‌గా వైసీపీని బ‌ద్నాం చేసే కార్య‌క్ర‌మానికి కూడా టీడీపీ వ్యూహ ర‌చ‌న చేసే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంద‌ని.. రాజ‌కీయ విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్త‌వానికి గోరంట్ల మాధ‌వ్ ఏమీ.. సీనియ‌ర్ నాయ‌కుడు కాదు. ఆయ‌న వెనుక ఆర్థిక బ‌లం కానీ, ప్ర‌జా బ‌లంకానీ.. ఏమీ లేవు. కేవ‌లం .. జ‌గ‌న్ ఫొటోతోను.. వైసీపీపై ఉన్న సింప‌తీతోనూ.. గ‌త ఎన్నిక‌ల్లో నెగ్గుకొచ్చిన సాధార‌ణ వ్య‌క్తి. సో.. ఇలాంటి వారిని స‌స్పెండ్ చేయ‌డం కంటే.. పార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌డ‌మే మేల‌ని.. పార్టీ వ‌ర్గాలు కూడా భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యం.. రేప‌టి పార్టీని బ‌లోపేతం చేస్తుందా.. ప్ర‌తిప‌క్షాల చేతికి చిక్కి.. బ‌ల‌హీన ప‌డుతుందా.. అన్న‌ది చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News