అనుకోని పరిణామం చోటు చేసుకున్నప్పుడు.. బాధితుల్ని పరామర్శించే ప్రోగ్రాం చేపడుతుంటారు రాజకీయ నేతలు. ఈ క్రమంలో బాధితులకు ఉత్త మాటలతో ఊరడించే కన్నా.. ఏదో ఒక సహాయం గురించి కానీ పరిహారం కానీ ప్రకటిస్తుంటారు. అలా అలవాటైన పనిని చేసిన మాజీ ముఖ్యమంత్రికి చేదు అనుభవం ఎదురైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఈ ప్రముఖ నేత నోట మాట రాకుండా చోటు చేసుకున్న ఈ పరిణామంలోకి వెళితే..
ఒక సామాన్యురాలి ఆగ్రహానికి కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని కెరూర్ పట్టణంలో ఈ నెల ఏడున ఇరు వర్గాల మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు కత్తులు.. రాడ్లతో బీభత్సాన్ని క్రియేట్ చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు హత్యకు గురి కాగా.. పలువురు గాయపడ్డారు.
ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత.. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య. బాగల్ కోట్ లోని ఒక ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నట్లుగా తెలుసుకున్న ఆయన.. వారిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా ఒక్కో క్షతగాత్రుడికి రూ.50 వేల చొప్పున అందించారు. ఇదంతా తన సొంత డబ్బునే ఇచచారు. అదే సమయంలో ఘర్షణల్లో గాయపడిన ఒక వ్యక్తితో సహా నలుగురు కుటుంబ సభ్యులకు రూ.2లక్షల మొత్తాన్ని వారికి ఇచ్చి.. బయటకు వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సిద్దరామయ్య ఇచ్చిన రూ.2లక్షల మొత్తాన్ని బాధితుల తరఫు మహిళ ఒకరు (గాయపడిన వ్యక్తి భార్య) సిద్దూ కారు మీదకు విసిరేశారు. తమకు కావాల్సింది డబ్బు కాదని.. న్యాయం కావాలని ఆ మహిళ పేర్కొంది. అంతేకాదు.. తాము ఏ తప్పు చేయకపోయినా.. తమపై దాడి చేశారని పేర్కొన్నారు.
గాయపడిన వారు ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని.. తమ సమస్యకు పరిష్కారం డబ్బులు కావని.. భిక్షాటన చేసైనా సరే తమ వాళ్లను కాపాడుకుంటామని.. అయితే.. ఇంత దారుణానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష వేయించాలని ఆమె డిమాండ్ చేశారు. మరి.. ఆమె మాటల్ని రాజకీయ నేతలు ఎలా తీసుకుంటారో చూడాలి.
తనకు ఎదురైన చేదు అనుభవంపై మాజీ సీఎం సిద్దరామయ్య స్పందించారు. బాధితుల బాధను అర్థం చేసుకోవాలని.. దీన్ని రాజకీయం చేయాలని తాను అనుకోవటం లేదని పేర్కొన్నారు. ఏమైనా.. పరిహారం పేరుతో బాధితుల్ని ఊరడించే ప్రయత్నాలకు చెక్ పెట్టేలా తాజా ఉదంతం చోటు చేసుకుందని చెప్పక తప్పదు.