జూనియ‌ర్ ఎన్టీఆర్ ను డ్యామేజీ చేస్తే..న‌ష్ట‌పోయేది మీరే లోకేష్‌

Update: 2021-11-26 09:30 GMT
ఔను! ఇప్పుడు ఈ మాటే అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. త‌ర‌త‌మ భేదాలు లేకుండా .. ప్ర‌తి ఒక్క‌రూ ఈ మాటే అంటున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. టీడీపీ నాయ‌కులు.. బుద్దా వెంక‌న్న‌, వ‌ర్ల రామ‌య్య వంటివారు.. తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు. ఇంత జ‌రిగితే.. ఇలాగేనా స్పందించేది.. నంద‌మూరి కుటుంబం గురించి మాట్లాడే అర్హ‌త మీకు ఉండ‌దు! అంటూ.. బుద్దా వెంక‌న్న వ్యాఖ్యానించ‌డం.. రాజ‌కీయాల్లోనే కాకుండా.. బ‌య‌ట జూనియ‌ర్ అభిమానుల్లోనూ తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. దీనిపై స్పందిస్తున్న‌వారు.. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. ముఖ్యంగా జూనియ‌ర్‌ను ఇలా విమ‌ర్శించ‌డం వ‌ల్ల‌.. న‌ష్ట‌పోయేది టీడీపీయేన‌ని నిర్మొహ‌మాటంగా చెబుతున్నారు.

విష‌యంలోకివెళ్తే.. దివంగ‌త ఎన్టీఆర్ కుమార్తె, చంద్ర‌బాబు స‌తీమ‌ణి, మాజీ మంత్రి లోకేష్ మాతృమూర్తి, హెరిటేజ్‌, ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌ల చైర్మ‌న్ నారా భువ‌నేశ్వ‌రిని అసెంబ్లీ నిండు స‌భ‌లో ఆఫ్ దిరికార్డుగా అవ‌మానిం చార‌ని.. వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలు.. ఆమెపై దూష‌ణ‌ల‌కు దిగార‌ని.. చంద్ర‌బాబు స్వ‌యంగా చెప్పుకొచ్చా రు. అటు అసెంబ్లీలోను, ఇటు.. బ‌య‌ట కూడా.. ఆయ‌న మీడియా ముందు బోరున విల‌పించారు. ఆ స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న‌ను పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ఖండించారు. ఇక‌, టీడీపీ నాయ‌కులు రోడ్డు మీద‌కు వ‌చ్చి.. సీఎం జ‌గ‌న్‌.. పార్టీ నేత‌లు.. మంత్రి కొడాలి నాని వంటివారి దిష్టిబొమ్మ‌లు త‌గుల బెట్టారు. నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ.. చాలా మంది వ్యాఖ్య‌లు చేశారు. ఇంట్లో వాళ్ల ను బ‌య‌ట‌కు లాగ‌డం స‌రికాద‌ని ఖండించారు. ఇక‌, రాష్ట్రాల‌కు అతీతంగా.. అటు తెలంగాణ‌లోనూ చంద్ర‌బాబుకు కొంద‌రు అండ‌గా నిలిచారు. జ‌గ్గారెడ్డి, సీత‌క్క‌, ఎమ్మెల్యే అరిక‌పూడి గాంధీ, అదేవిధంగా వైఎస్ కుటుంబానికి ఒక‌ప్పుడు అండ‌గా ఉన్న‌.. జ‌గ‌న్ కోసం.. త‌న మంత్రి ప‌ద‌విని వ‌దులుకున్న కొండా సురేఖ సైతం.. వైసీపీ నేత‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. ఘ‌ట‌న‌ను త‌ప్పుబ‌ట్టారు. ఇది మంచిప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇక‌, నంద‌మూరి కుటుంబం కూడా మీడియా ముందుకు వ‌చ్చింది.

వాస్త‌వానికి ఈ కుటుంబంలోని మ‌హిళ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు మీడియా ముందుకు రాలేదు. కానీ,బాబు ఏడుపు చూసిన త‌ర్వాత‌.. వారు కూడా మీడియా ముందుకు వ‌చ్చి వైసీపీపై కామెంట్లు చేశారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా వీడియో రూపంలో ఈ ఘ‌ట‌న‌ను ఖండించారు. అటు వైసీపీని, ఇటు టీడీపీని ఆయ‌న హెచ్చ‌రించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మంచివికావ‌ని.. ఒక కొడుకుగా, తండ్రిగా, భ‌ర్త‌గా, బాధ్య‌త గ‌ల పౌరుడిగా తాను చెబుతున్నారు. అదేవిధంగా త‌ర్వాత కూడా రోజుకొక నాయ‌కుడు నాయ‌కురాలు.. దీనిపై స్పందించారు.

అదేస‌మ‌యంలో టీడీపీ నేత‌లు కూడా రోజూ.. ఏదో ఒక కార‌ణంతో మీడియా ముందుకువ చ్చి.. నాటి ఘ‌ట‌న‌ను లేవనెత్తుతూనే ఉన్నారు. సో..దీనిని బ‌ట్టి ఆ సంఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా వాడుకునేందుకు, ఓటు బ్యాంకుగా మ‌లుచుకునేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌నే వ్యాఖ్య‌లు .. విశ్లేష‌కుల నుంచి వినిపిస్తు న్నాయి. ఎందుకంటే.. ఏదో ఒక విష‌యం.. వ‌స్తే..కానీ. టీడీపీకి ఇప్పుడున్న ప‌రిస్థితిలో మైలేజీ రాదు. సో.. దీనిని ఇటా వాడుకుంటున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక‌, ఈ క్ర‌మంలో టీపీపీ సీనియ‌ర్ అయిన‌.. వ‌ర్ల రామ‌య్య ధ‌ర్నాకు కూర్చున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జూనియ‌ర్‌పై కొన్ని వ్యాఖ్య‌లు చేశారు.

సొంత మేన‌త్త‌, చంద్ర‌బాబు స‌తీమ‌ణి.. భువ‌నేశ్వ‌రిని ఇలా దూషిస్తే.. ఇలాగేనా స్పందించేదంటూ.. ఆయ‌న రుస‌రుస‌లాడారు. ఒక యువ‌కుడు అయి ఉండి.. చేవ చ‌చ్చిన ముస‌లివాడిలాగా స్పందిస్తారా? అంటూ.. కామెంట్లు చేశారు. ఇక‌, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న కూడా జూనియ‌ర్‌పై కారాలు మిరియాలు నూరారు. నంద‌మూరి కుటుంబం గురించి మాట్లాడ‌డే అర్హ‌త కూడా జూనియ‌ర్ పోగొట్టుకున్నార‌ని అన్నారు. అయితే.. ఇవ‌న్నీ అనేసిన ఈ ఇద్ద‌రు నాయ‌కులు కూడా వీటికి, చంద్రబాబుకు సంబంధం లేద‌ని చెప్పారు. మొత్తానికి ఇది రాజ‌కీయంగా నే కాకుండా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌ను కూడాఆలోచ‌న‌లో ప‌డేసింది.

వ‌ర్ల రామ‌య్య‌, బుద్దా వెంక‌న్న వంటివారు .. స్క్రిప్టు ఇస్తే.. జూనియ‌ర్ చ‌ద‌వాలా? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఎవ‌రి ఆలోచ‌న‌ల ప్ర‌కారం వారు.. వాళ్ల స్పంద‌న చెబుతార‌ని.. జూనియ‌ర్ అభిమానులు అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జూనియ‌ర్ అభిమానులు దాదాపు టీడీపీకి అండ‌గా ఉంటున్నారు. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. వారు టీడీపీకి ఓట్లేస్తున్నారు. మ‌రి ఇప్పుడుజూనియ‌ర్‌ను టార్గెట్ చేస్తే..వారి ఓట్లు టీడీపీ కి ఎలా ప‌డ‌తాయో.. పార్టీ నాయ‌కులు ఆలోచించాల‌ని .. అభిమానులు చెబుతున్నారు. ఇలా.. జూనియ‌ర్‌ను రోడ్డున ప‌డేస్తే.. న‌ష్టపోయేది టీడీపీనేన‌ని అంటున్నారు.

ఈ లాజిక్‌ను టీడీపీ నాయ‌కులు వ‌ర్ల‌, బుద్దాలు ఎలా మ‌రిచిపోయార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ ఇద్ద‌రు నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు.. జూనియ‌ర్‌ను కించ ప‌రిచేలావ్యాఖ్యానించిన తీరును లోకేష్‌, చంద్ర‌బాబు క‌నుక ఖండించ‌క‌పోతే.. ఖ‌చ్చితంగా.. ఈ వ్యాఖ్య‌ల వెనుక వారు ఉన్నార‌నే భావ‌న రావ‌డంతోపాటు.. అభిమానులు దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో జూనియ‌ర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తే.. టీడీపీ ప‌రిస్థితి ఏంట‌ని .. కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పంద‌న బాగానేఉందని.. ఆయ‌న ఎక్క‌డా త‌బ‌డ‌లేద‌ని.. ఆయ‌న అభిమానులు చెబుతున్నారు. మ‌రి దీనిపై టీడీపీ వాళ్ల‌కు ఏంటి న‌ష్టం అని ప్ర‌శ్నిస్తున్నారు.ఈ నేప‌థ్యంలో లోకేష్‌, చంద్ర‌బాబులు.. ఖ‌చ్చితంగా.. స్పందించాల‌ని సూచిస్తున్నారు. రియాక్ట్ కాక‌పోతే.. దీని వెనుక‌.. లోకేష్ ఉన్నాడ‌నే అనుకుంటార‌ని.. సినీ వర్గాల్లోనూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అప్పుడు.. టీడీపీకి న‌ష్టం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు సైతం భావిస్తున్నారు. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News