అవ‌స‌ర‌మైతే.. ఒంట‌రి పోరు.. బీజేపీ మాన‌సికంగా సిద్ధ‌మా?

Update: 2022-04-04 07:29 GMT
రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు.. అలాగే శాశ్వ‌త శ‌తృవులు కూడా ఉండ‌రని అంటారు. ఇప్పుడు బీజేపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య కూడా ఇదే ఫార్ములా తెర‌మీదికి వ‌స్తున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. బీజేపీ క‌ర డు గ‌ట్టిన టీడీపీ వ్య‌తిరేక వాదంతో అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర నేత‌ల్లో సోము వీర్రాజు.. ఈ వాద నను బ‌లంగా వినిపిస్తున్నారు. ఇత‌ర నేత‌ల మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీతో క‌లిసి ప‌నిచేసేందు కు ఆయ‌న ముందుకు రావ‌డం లేదు. అస‌లు ఈడీపీ అన్న మాట‌ను అనేందుకు, వినేందుకు కూడా ఆయ న ఇష్ట‌ప‌డ డం లేదు. ఈ ప‌రిణామ‌మే జ‌న‌సేన‌-బీజేపీ మ‌ధ్య బీట‌లు వ‌చ్చే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది.

గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రికి వారుగా పోటీ చేసిన బీజేపీ, జ‌న‌సేన పార్టీలు.. త‌ర్వాత‌.. కొన్నాళ్ల‌కే కేంద్ర‌పెద్ద‌ల స‌మ‌క్షంలో చేతులు క‌లిపారు. చేత‌లైతే.. క‌లిపారు కానీ.. మ‌న‌సులు మాత్రం క‌ల‌వ‌లేదనే అంటున్నారు ప‌రిశీల‌కులు. బీజేపీ ఎత్తుకున్న దేవాయాల‌పై దాడుల ఘ‌ట‌న‌ల‌ను జ‌న‌సేన ప‌ట్టించుకోలే దు. మైనార్టీ ఓట్లు ఎక్క‌డ పోతాయోన‌ని.. జ‌న‌సేన భ‌యం కావొచ్చు. ఇక‌, జ‌న‌సేన భుజాన వేసుకున్న ఎస్సీ ల‌పై దాడులు, ర‌హ‌దారుల‌పై గోతుల అంశాల‌ను బీజేపీ అస్స‌లు ప‌ట్టించుకోలేదు. దీంతో ఎవ‌రికి వారుగా ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ నిర్మించుకుని ముందుకు సాగారు.

ఇక‌, బీజేపీ వాద‌న‌ను జ‌న‌సేన స‌మ‌ర్ధించిన సంద‌ర్భాలు కానీ, జ‌న‌సేన వాద‌న‌ల‌ను బీజేపీ నేత‌లు స‌మ ర్ధించిన సంద‌ర్భాలు కానీ.. ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఈ ప‌రిణామ‌మే.. ఇరు పార్టీల మ‌ధ్య క‌నిపించ‌ని విభ‌జ న రేఖ‌ను గీసింది. దీనికి మ‌రో కార‌ణం కూడా ఉంది. పైకి త‌మ‌తో పొత్తు కొన‌సాగిస్తున్నా.. జ‌న‌సేన లోపాయి కారీగా.. టీడీపీతో చేతులు క‌లిపింద‌నే భావ‌న బీజేపీ నేత‌ల్లో ఉంది. ముఖ్యంగా తిరుప‌తి ఉప ఎన్నిక‌లో బీజేపీ ప‌క్షాన ప్రచారం చేసినా.. అంత‌ర్గ‌తంగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు.. టీడీపీకి ప‌నిచేశార‌ని.. సోము అప్ప‌ట్లో నే గుర్రుమ‌న్నారు. ఇక‌, దీని త‌ర్వాత‌, ముందు జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన -టీడీపీ చేతులు క‌లిపాయి.

అధినేతల నుంచి ఆదేశాలు లేక‌పోయినా.. క్షేత్ర‌స్థాయిలో టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు క‌లిసి అడుగులు వేశారు. ఈ ప‌రిణామాలు బీజేపీలో క‌ల‌క‌లం రేపాయి. మ‌రోవైపు.. దీనిపై అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు కొన‌సాగుతు న్న క్ర‌మంలోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్.. ఇటీవ‌ల పార్టీ ఆవిర్భావ స‌భ‌లో వైసీపీ వ్య‌తిరేక ఓటును చీల కుండా చూస్తాన‌ని చెప్పారు. అంటే.. ఆయ‌న వుద్దేశం.. టీడీపీని క‌లుపుకొని ముందుకు సాగుతాన‌ని చెప్ప‌క నే చెప్పిన‌ట్టు అయింది. ఇది బీజేపీ నేత‌ల‌కు అస్స‌లు మింగుడు ప‌డ‌డం లేదు. మోడీని తిట్టిన పార్టీ.. మోడీ స‌ర్కారుపై పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం ఇచ్చిన పార్టీతో క‌లిసి ముందుకు సాగేది లేద‌ని.. సోము వీర్రాజు అంత‌ర్గ‌త స‌మావేశాల్లో చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌పై నా విభేదిస్తున్నారు. వైసీపీ వ్య‌తిరేక‌ ఓటు బ్యాంకు చీల్చ‌కుండా ముందుకు వెళ్లాలంటే.. టీడీపీతో క‌లిసి ప‌నిచేయాల‌న్న‌.. జ‌న‌సేన వ్యూహంతో విభేదిస్తున్నారు. అయితే.. జ‌న‌సేన బీజేపీకి దూరం అయ్యేందుకు ఏమీ మార్గాలు క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే బీజేపీ రూట్ మ్యాప్ అంటూ.. ప‌వ‌న్ ఒక ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కురూట్ మ్యాప్ ఇవ్వ‌లేదు. క‌నుక‌.. దీనిని అడ్డు పెట్టుకుని.. ఆయ‌న బీజేపీ నుంచి దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఇక‌, బీజేపీ కూడా.. టీడీపీతో పొత్తు అంటే.. అస‌లు జ‌న‌సేనే అవ‌స‌రం లేద‌నే తీరులో ఉంది. తాజాగా సోము వీర్రాజు ఈ వ్యాఖ్య‌లే చేశారు. జ‌న‌సేన పార్టీతో త‌మ‌కు ఇప్ప‌టికే పొత్తు ఉంద‌న్నారు. ప్ర‌స్తుతానికి ఇంకెవ‌రితోనూ క‌లిసి పని చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అవ‌స‌ర‌మైతే ఒంట‌రిగానైనా పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌ని ఆయ‌న ప్ర‌క‌టించడం ప్రాధాన్యం సంత‌రించుకుంది. జ‌న‌సేనాని త‌మ‌తో క‌లిసి వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపించ‌క‌పోవ‌డంతో బీజేపీ త‌మ శ్రేణుల్ని మాన‌సికంగా ఒంట‌రి పోరాటానికి స‌మాయ‌త్తం చేసే క్ర‌మంలో వీర్రాజు ఈ మాట‌ల‌న్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News