అది నిజమైతే.. మనది నకిలీ ప్రజాస్వామ్యమే: సినీ దర్శకుడు

Update: 2021-01-17 13:27 GMT
బోగస్ టీఆర్పీ రేటింగుల కేసు విషయమై అభియోగం ఎదుర్కొంటున్న రిపబ్లిక్ టీవీ చానల్ సీఈవో అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చాట్ అంటూ తాజాగా ఆన్లైన్లో దాదాపు 500 పేజీల సంభాషణ లీకైన విషయం తెలిసిందే. బార్క్ మాజీ సీఈవోతో అర్నాబ్ జరిపిన చాట్ అంటూ తెరపైకి వచ్చి సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై  తెలుగు సినీ దర్శకుడు బీవీఎస్ రవి ఆందోళన వ్యక్తం చేశారు.

తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అర్నాబ్ వాట్సాప్ లీక్‌పై బీవీఎస్ రవి స్పందిస్తూ 'అర్నాబ్ వాట్సాప్ చాట్ నిజమే అయితే, మనం నకిలీ ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నట్లే. రాజకీయపరంగా నాకు ఏ ఇతర న్యూస్ చానళ్లతో అనుబంధం అవసరం లేదు'' అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు అర్నాబ్ గోస్వామి ఎక్స్‌పోస్‌డ్', 'అర్నాబ్ గేట్' అనే రెండు హ్యాష్‌ట్యాగుల్ని జత చేశారు రవి.

దేశవ్యాస్తంగా సంచలనం సృష్టించిన టీఆర్‌పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగానే... రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన సంభాషణలు లీకైన విషయం తెలిసిందే.

ఈ చాట్ మెసేజ్‌లు దాదాపు 500 పేజీలకు పైగా ఉన్నాయట. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంట్లో మంత్రులు అందరూ మన వెనకే ఉన్నారని వ్యాఖ్యానించాడట అర్నాబ్ గోస్వామి. అంతేకాకుండా.. రక్షణ రహస్యాలు సహా అనేక కీలక అంశాల గురించి ఇద్దరి మధ్య సంభాషణలు జరిగాయని సమాచారం. ఈ సంభాషణలు దేశ వ్యాప్తంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
Tags:    

Similar News