నడిచొచ్చిన దారిని మర్చిపోకుండా ఉండటం. అందనంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండటం.. ప్రఖ్యాత సెలబ్రిటీ అయినప్పటికీ.. ఇప్పటికీ అదే సింప్లిసిటీతో ఉండటం అందరికీ సాధ్యం కాదు. ఒక్క మాటలో అతడ్ని పరిచయం చేయాలంటే అతడ్ని కిక్రెట్ దేవుడంటారు.
ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అతడెవరో. అవును.. అతడే సచిన్ టెండూల్కర్. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసిన ఈ స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్లకు పిచ్చి పిచ్చగా నచ్చేస్తోంది. బెళగాం - గోవా ఎక్స్ ప్రెస్ హైవే మీద ప్రయాణిస్తున్న సచిన్ టెండూల్కర్.. మార్గ మధ్యలో ఆపి.. వేడి వేడి ఛాయ్ తాగారు. దానిలో రస్క్ ను నంజుకు తిన్నారు.
తాను ఇప్పటికి సామాన్యుడిగానే ఉన్నానన్న విషయాన్ని తాజా స్టోరీతో స్పష్టం చేశారు. అంతేకాదు.. తన కొడుకును తాగుతావా? అని అడగటం.. అతగాడు చూస్తుండటం చూస్తే.. కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన సచిన్ కు.. ఆయన కొడుక్కి ఉన్న వ్యత్యాసం ఇట్టే అర్థమైపోతుంది. అనుకోని రీతిలో తమ వద్దకు వచ్చిన క్రికెట్ దేవుడ్ని చూసి.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఉదయాన్నే చిరుతిళ్లతో.. ఇలా వేడి వేడి ఛాయ్ తాగితే ఆ మజానే వేరన్న సచిన్ మాటకు నెటిజన్లు నూటికి నూరుశాతం నిజమంటూ రిప్లై ఇస్తున్నారు.
రస్క్ ను టీలో ముంచుకొని తాగిన సచిన్.. షాపులో ఉన్న ఉద్యోగిని.. అక్కడి వారిని పలకరించటం.. వారి గురించి తెలుసుకోవటంతో పాటు.. వారితో తాను సెల్ఫీ దిగిన తీరును చూసినోళ్లంతా.. సచిన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. టీ షాపు వద్దకు వచ్చిన ఒక విద్యార్థిని పలుకరించి.. ఆమెతో మాట్లాడి... ఆమె భుజం తట్టిన వైనం చూసినోళ్లంతా సచిన్ తీరుకు ఫిదా అవుతున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగినట్లుగా ఉన్న అతడి తీరును మిగిలిన ఆటగాళ్లు.. సెలబ్రిటీలు నేర్చుకోవాలంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. వీడియోను చూసేయండి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View