స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కచ్ఛితంగా వాడే అప్లికేషన్ వాట్సాప్. ఇవాల్టి రోజున వాట్సాప్ అన్నది లేకుంటే.. అన్న మాటను సైతం జీర్ణించుకోలేని పరిస్థితి. ప్రపంచ గమనాన్ని పూర్తిగా మార్చేసిన అతికొద్ది అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటిగా చెప్పాలి. మనిషి జీవితంలో విపరీతమైన వేగాన్ని వాట్సాప్ తీసుకొచ్చిందనే చెప్పాలి. ఒకవిధంగా చెప్పాలంటే సమాచార విప్లవానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది వాట్సాప్. క్షణాల్లో సమాచారం ఏ రూపంలో ఉన్నా.. ప్రపంచంలోని ఏ మూలకైనా ఇట్టే బట్వాడా చేసే సత్తా వాట్సాప్ సొంతమని చెప్పాలి.
అలాంటి వాట్సాప్ లో ఉండే సౌకర్యాలు.. పీచర్లు చాలామందికి తెలీదు. ఎక్కడిదాకానో ఎందుకు వాట్సాప్ కు సంబందించినంతవరకు 65536 నెంబరుకు ప్రత్యేకత ఒకటి ఉంది. వాట్సాప్ లో పంపే ఫోటోలు.. వీడియోలు.. ఆడియో డాక్యుమెంట్ తో పాటు.. టెక్ట్స్ కు పరిమితి ఉంది. ఏదైనా షేర్ చేయొచ్చుకానీ..
ఒక పరిమితి దాటిన తర్వాత వాటిని పంపటం సాధ్యం కాదు. టెక్ట్స్ విషయానికే వస్తే.. వాట్సాప్ లో 65536 అక్షరాలకు మించి పంపటం సాధ్యం కాదు. ఒకవేళ దానికి మించిన అక్షరాల్ని పంపే ప్రయత్నం చేస్తే.. వాట్సాప్ స్క్రీన్ మీద.. మొదటి 65536 అక్షరాల్ని మాత్రమే పంపటం సాధ్యమవుతుందన్న పాప్ అప్ కనిపిస్తుంది.
వాట్సాప్ లో టెక్ట్స్ కు ఎలాంటిపరిమితి ఉందో.. ఫోటోలకు.. వీడియోలకు అలాంటి పరిమితులే ఉన్నాయన్న విషయం తెలిసిందే. వీడియోలను ఒకేసారి 30కు మించి పంపలేం. అది కూడా ఒక్కో ఫైలు 16 ఎంబీకి మించి ఉండకూడదు.
అదే సమయంలో వాట్సాప్ లోని కెమెరా ఆప్షన్ ద్వారా రికార్డు చేసిన వీడియో సైతం 16 ఎంబీకి మించి ఉండకూడదు. డాక్యుమెంట్ విషయానికి వస్తే 100 ఎంబీ సైజు ఉన్న వాటిని మాత్రమే పంపే వీలుకు బదులుగా 2 జీబీ సైజ్ ఉన్న డాక్యుమెంట్ ను సైతం పంపే సౌకర్యాన్ని అందిస్తున్నారు. అందుకే వాట్సాప్ అంటే అందరు అంతలా ఫిదా కావటానికి కారణం ఇదే మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.