టిక్కెట్ ఇవ్వ‌క‌పోతే ఇండిపెండెంట్‌గా రెడీ అంటోన్న వైసీపీ ఎమ్మెల్యేలు..!

Update: 2022-02-14 04:05 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం. అందుకే దీపం ఉండ‌గానే ఇల్లు స‌ర్దుకోమ‌న్న‌ట్టుగా.. వైసీపీలోనే ఒక‌రిద్ద‌రు నాయ‌కులు సొంత‌గానే ప్ర‌జాబ‌లం వైపు మొగ్గు చూపుతున్నారు. పార్టీలో అస‌మ్మ‌తి పెరుగుతుండడం.. వారు త‌మ పంథాల‌ను మార్చుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డం.. పైగా.. దూకుడు ఎక్కువ‌గా ఉండ‌డం వంటి కార‌ణాల‌తో ఎమ్మెల్యేలు.. ఒక‌రిద్ద‌రు.. అవ‌స‌ర‌మైతే.. మేం మా అంత‌ట‌గా గెలిచేందుకు రెడీ  అంటూ.. ప‌రోక్షంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇది పార్టీకి హాని చేయ‌క‌పోయినా.. రాజ‌కీయంగా మాత్రం చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఇలాంటివారిలో ముందున్నారు.. చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఆమెకు ఉన్నఅస‌మ్మ‌తి.. అంతా ఇంతా కాదు. సొంత పార్టీలోనే సెగ‌లు పుడుతున్నాయి. ఆమెకు వ్య‌తిరేకంగా.. ప్ర‌చారం నిత్యం జ‌రు గుతూనే ఉంది. అంతేకాదు.. ఒక కీల‌క మంత్రి ఏకంగా.. రోజాకు వ్య‌తిరేకంగా చక్రం తిప్పుతున్నార‌నే వాద‌న కూడా పార్టీలో వినిపిస్తోంది.

 ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నికల్లో త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే.. అవ‌స‌ర‌మై తే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల‌ని ఆమె నిర్ణ‌యించుకున్న‌ట్టు స్థానికంగా గ‌ట్టి ప్ర‌చారం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె సొంత ఇమేజ్ కోసం ఎప్ప‌టిక‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ.. సొంత అభిమాన‌గ‌ణం పెంచుకుంటున్నార‌ట‌.

అలాగే ప్ర‌భుత్వ సేవ‌లే కాకుండా స్వ‌చ్ఛంద సేవ‌లు కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తున్నారు. సో.. రోజా వ్యూహం అదిరిపోయేలా ఉంద‌నే వాద న విశ్లేష‌కుల నుంచి కూడా వినిపిస్తోంది. మ‌రోవైపు.. ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. బుర్రా మ‌ధుసూద‌న్‌యాద‌వ్‌కు కూడా టికెట్ ద‌క్కే అవ‌కాశం లేద‌ని... ప్ర‌చారం జ‌రుగుతోంది.

 ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ అవ‌డం లేద‌ని.. వ్యాపారాలు వ్య‌వ‌హారాల్లో మునిగిపోయార‌ని సొంత పార్టీలోనే వ్య‌తిరేక వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. దీంతో మ‌ధు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నుక త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే అయితే ఇండిపెండెంట్‌గా పోటీ చేయ‌డం.. లేదా మ‌రో కీల‌క పార్టీ త‌ర‌పున పోటీ చేస్తార‌న్న టాక్ అక్క‌డ వినిపిస్తోంది. కుల బ‌లం గ‌ట్టిగా ఉండ‌డంతో మ‌ధు వెన‌క్కు త‌గ్గేలా లేర‌ని అంటున్నారు.

ఇక‌, ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు నుంచి భారీ మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్న అన్నారాంబాబుకు కూడా టికెట్ ఇవ్వొద్ద‌ని.. పార్టీలో ఇప్ప‌టికే వంద‌ల మంది అభ్య‌ర్థ‌న‌లు చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆయ‌న త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ప్ర‌జ‌ల‌కు కూడా చేరువ కావడం లేదని..ఎన్నిక‌ల‌కు ముందు ఉన్న హ‌వా ఇప్పుడు లేద‌ని..ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. పార్టీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని .. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

దీంతో ఆయ‌న కూడా ముందు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. పార్టీ టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ఒంట‌రిగా అయినా పోటీ చేసి స‌త్తా చాడ‌డం లేదా మ‌రో ప్ర‌ధాన పార్టీ  టిక్కెట్ ఇస్తే ఆ రూట్లో అయినా ట్రై చేసేందుకు రెడీ అవుతున్నార‌ట‌.

 ఆయ‌న గ‌తంలో ప్ర‌జారాజ్యం నుంచి కూడా గెలవ‌డంతో ఆ ధీమాతో ఉన్నార‌ని టాక్ ?  మొత్తానికివైసీపీలో చాలా మంది నేత‌ల‌కు త‌మ త‌మ వ్యూహాల‌ను రెండేళ్ల‌కు ముందుగానే సిద్ధం చేసుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News