కేడ‌ర్‌కు ఏం చెబుదాం.. ఇలా అయితే క‌ష్ట‌మే స‌ర్‌..!

Update: 2023-01-14 04:33 GMT
రాష్ట్రంలో రాజ‌కీయ‌ పొత్తుల వ్య‌వ‌హారం... ర‌స‌కందాయంలో ప‌డింది. అస‌లు పొత్తులు ఉంటాయా?  ఉండవా? అనేది తెలియ‌క‌.. టీడీపీ-జ‌న‌సేన వ‌ర్గాల్లో అయోమ‌యం నెల‌కొంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పొత్తులు ఉంటాయ‌ని.. భావించిన నాయ‌కులు.. ముఖ్యంగా టీడీపీ నేత‌లు ఏం జ‌రిగినా ఫ‌ర్లేద‌ని.. మాన‌సికంగా రెడీ అయ్యారు. కొంద‌రు అయితే.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌ను వ‌దిలేసుకున్న‌ట్టు  ప్ర‌క‌టించారు.

దీంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నా.. త‌మ్ముళ్లు మాత్రం కార్య‌క్ర‌మాల‌కు ముందుకు రాలేదు. దీంతో త‌మ్ముళ్లు మాట విన‌డం లేద‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు త‌నే స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఆయ‌నే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. దీంతో పార్టీలో కొంత జోష్ వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు మ‌రోసారిపొత్తుల‌పై త‌ర్జ‌న భ‌ర్జ‌న వాతావ‌ర‌ణం నెల‌కొంది. పొత్తుల‌పై జ‌న‌సేనాని ఆచి తూచి మాట్లాడారు.

ప్ర‌జ‌లు త‌న వెంట ఉంటార‌ని భావిస్తే.. పొత్తులు లేకుండా ఒంట‌రిపోరు చేస్తాన‌ని చెప్పారు. ఇది టీడీపీని  ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. ప‌వ‌న్‌ను న‌మ్ముకుని ఎలా ? వెళ్లాల‌నే విష‌యంలో వారు ఇబ్బంది ప‌డుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ..ఏ పార్టీ అయినా.. అనూహ్యంగా అధికార ప‌క్షాన్ని లేదా.. ప్ర‌త్య‌ర్థి పార్టీని ఆత్మ‌ర‌క్ష ణ‌లో పేడేసే చ‌ర్యలు చేప‌డుతుంది. కానీ.. ప‌వ‌న్ మాత్రం న‌మ్ముకుంటున్న పార్టీని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

దీంతో టీడీపీ కేడ‌ర్ మ‌రింత బ‌ల‌హీన ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. దీనిపై సీనియ‌ర్లు కూడా దృష్టి పెట్టారు. ఏం చేయాలి?  పొత్తులు లేకుండా వెళ్లిపోదామా?  లేక‌.. పొత్తులు ఉన్నాయ‌ని చెబుదామా?  ఏదో ఒకటి తేల్చ‌కుండా.. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు కూడా ఇలా సాగ‌దీస్తూ.. పోతే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని ఆవేద‌న , ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై చంద్ర‌బాబు రియాక్ష‌న్ ఏంట‌నేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News