పిల్లలు కావాలంటే మద్యం బందే

Update: 2019-10-04 05:41 GMT
ఆధునిక సమాజం.. ఉరుకుల పరుగుల జీవితం.. వేతనాలు భారీగా ఉన్నా సుఖం లేని కాలం..ఇంటా బయటా ఒత్తిళ్లతో మద్యం తాగి రిలాక్స్ అవుతున్నారు నేటి జంటలు. ఇక సంసారం సుఖం అంతంతే.. అందుకే ఇప్పుడు జంటలకు పిల్లలు పుట్టడం అనేది గగనంగా మారింది. దీనికోసం డాక్టర్లను సంప్రదిస్తూ లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు..

అయితే మీకు పిల్లలు కావాలంటే మాత్రం ఖచ్చితంగా మద్యానికి దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. లేదంటే మీకు పిల్లలు పుట్టరని.. పుట్టినా మానసికంగా.. శారీరకంగా బలహీనులు పుట్టి ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయని పరిశోధనలో తేల్చారు.

చైనా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దాదాపు 30 ఏళ్ల డేటా ఆధారంగా3.40 లక్షల మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. పురుషులు.. తమ భార్య గర్భం ధరించడానికి 6 నెలల ముందుగానే అల్కహాల్ తీసుకోవడం మానేయాలని సూచిస్తున్నారు. అల్కహాల్ తీసుకోవడం కొనసాగిస్తే పుట్టబోయే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంతో ఉండరని..పుట్టుకతో వచ్చే గుండే జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

ఇక మహిళలు కూడా గర్భాధారణకు ఏడాది ముందే అల్కహాల్ తీసుకోవడం మానేస్తేనే పిల్లలు ఆరోగ్యంతో పుడుతారని స్పష్టం చేశారు. భార్య, భర్త మద్యం తాగి గర్భాధారణ చేసుకున్న వారిలో 42శాతం పిల్లలు ఆరోగ్య సమస్యలతో పుట్టారని వివరించారు. దీంతో పిల్లలు కావాలనుకునే దంపతులు ఖచ్చితంగా ఆ ఏడాది పాటు మద్యానికి దూరంగా ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు..

    

Tags:    

Similar News