పానీ పూరీ అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా అందరూ దీన్ని ఇష్టంగా తింటుంటారు. సాయంత్రమైతే చాలు అలా సరదాగా అలా బయటికి వెళ్లి పానీపూరి తినే వారు ఎంతో మంది ఉంటారు. కాగా ఓ పానీ పూరీ వాలా చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. అతడు టాయిలెట్ వినియోగం కోసం ఉంచిన నీటిని తీసుకు వచ్చి పానీపూరికి వాడే రసంలో కలిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చి అవి వైరల్ గా మారడంతో విషయం తెలుసుకున్న జనాలు అతడిని పట్టుకుని చితకబాదారు. ఈ సంఘటన కొల్హాపూర్‌లో జరిగింది.
పట్టణంలోని రంకాల లేక్ వద్ద 'ముంబై కా స్పెషల్ పానీ పూరి వాలా 'పేరుతో ఓ వ్యక్తి పానీ పూరి సెంటర్ ను నడుపుతున్నాడు. ఆ ప్రాంతంలో ఈ దుకాణం బాగా ఫేమస్. సాయంత్రం అయితే చాలు అతడి వద్ద పానీ పూరి తినడానికి ఆ ప్రాంతం వాసులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇటీవల ఓ రోజు ఆ పానీపూరి వాలా రోడ్డు పక్కన పబ్లిక్ టాయిలెట్ బయటే ఉన్న నీటిని తెచ్చి పానీపూరి రసంలో కలిపాడు. అతను చేసిన పనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇది అందరికీ తెలిసింది. ఈ వీడియో చూసిన ఆ ప్రాంత వాసులు అతడిని చితక్కొట్టారు. బండిని కిందపడేసి వస్తువులను ధ్వంసం చేశారు. ఇప్పటికైనా కైనా బయట చిరుతిళ్ళ కోసం ఎగబడేవారు బయట ఎంత శుభ్రత పాటిస్తారో గుర్తించి జాగ్రత్త పడితే ఎంతో మేలు.