రేప్ చేసి పెళ్లి చేసుకుంటే నో శిక్ష

Update: 2020-01-25 05:32 GMT
దేశంలో మహిళలకు భద్రత ఎండమావే అని చాలా సంఘటనలు నిరూపించాయి.. నిర్భయ, దిశ, సహా ఆడవాళ్ల భద్రత గాలిలో దీపమని కళ్లకు కట్టాయి. ఆడవారు రోడ్డు మీద ఒంటరిగా రావాలంటేనే భయపడే పరిస్థితి. ‘నిర్భయ’లాంటి కఠిన చట్టాలు తెచ్చినా నిన్నటికి నిన్న 16 ఏళ్ల బాలికను హైదరాబాద్ లో ఎత్తుకెళ్లి ముగ్గురు కామాంధులు రేప్ చేసిన పరిస్థితి. ఓవైపు నిర్భయ నిందితులకు ఉరిపడుతున్నా దేశంలో అత్యాచారాల పరంపర ఆగడం లేదు.

ప్రపంచవ్యాప్తంగా మహిళల భద్రతపై చర్చ నడుస్తున్న వేళ టర్కీ దేశంలోని పార్లమెంట్ లో ఓ వివాదాస్పద బిల్లును ప్రవేశపెట్టడంపై దుమారం రేపింది. యూరప్ ను ఆనుకొని ఉండే టర్కీ దేశంలో రేపిస్టులను శిక్ష నుంచి తప్పించేలా ఓ చట్టం రూపొందించడం వివాదాస్పదమైంది. ‘మ్యారీ యువర్ రేపిస్ట్’ అనే ఈ బిల్లును ఈనెల చివరన పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. 18 ఏళ్లలోపు చిన్నారులు, యువతులపై లైంగిక దాడి లేదా అత్యాచారం చేసిన నిందితులు బాధితులను పెళ్లి చేసుకుంటే శిక్ష నుంచి మినహాయింపునిచ్చేలా చట్టాన్ని రూపొందించారు.

అంటే లైంగికదోపిడీ చేసిన నిందితులను అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకుంటే ఈ బిల్లు రక్షణ కల్పిస్తుందన్నమాట.. మహిళల హక్కులను కాలరాస్తున్న ఈ బిల్లు పై ఆదేశం లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు కూడా ఈ బిల్లుపై మండి పడుతున్నాయి. మరి టర్కీ ఏం చేస్తుందనేది వేచిచూడాలి.
Tags:    

Similar News