సరికొత్త వయాగ్రా.. ముక్కులో స్ప్రే చేసుకుంటే కీలు గుర్రమే?

Update: 2021-03-02 23:30 GMT
పురుషులైనా.. స్త్రీలైనా సరే ఒక వయసు వచ్చాక శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంది.. మోనోపోజ్ దశలోకి వచ్చాక మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో మగాళ్ల మూడ్ ను వీరు చెడగొడుతుంటారు..

అయితే శృంగారంపై ఆసక్తి తగ్గుతున్న వారికి పడక గదిలో ఆనందాన్ని రెట్టింపు చేసే ఔషధం వయాగ్రా. ఇప్పటివరకు ఇది పురుషులకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మహిళల కోసం ప్రత్యేకంగా ఈ నాసల్ స్ప్రే వయాగ్రాను తయారు చేశారు. దీన్ని ముక్కులో స్ప్రే చేసుకుంటే చాలట.. మూడ్ దానంతట అదే వచ్చేస్తుందట..ఎక్కువసేపు పడక గది సుఖాన్ని ఆస్వాదించేందుకు ఈ స్ప్రే ఉపయోగపడుతుందని తయారీదారులు తెలిపారు.

ఇప్పటివరకు మహిళలకు శృంగార సమయాన్ని పెంచేందుకు మందులు లేవు. పురుషులకు ‘వయాగ్రా’ లాంటి మందులున్నాయి. అయితే తాజాగా మహిళల కోసం శృంగార సామర్థ్యం పెంచేందుకు ఈ స్ప్రేను తయారు చేశారు. ముఖ్యంగా సంతానం కోసం పరితపించే మహిళలకు తప్పకుండా ఎక్కువ సేపు ఆ పనిలో పాల్గొనేలా వయాగ్రాను తయారు చేయాలని సంకల్పించారు.

చాలా మంది మహిళలకు శృంగారంపై ఆసక్తి తగ్గి ఒకవేళ ప్రయత్నించినా ఎక్కువ సేపు చేసేందుకు ఆసక్తి ఉండటం లేదని తెలుపుతున్నారు. ఇంటి పనిచేసుకుంటూ పిల్లల బాగోగులు చూసుకునే మహిళలు ఒత్తిడికి గురై పడకగది సుఖాన్ని అస్వాదించలేకపోతున్నారు అని ఆస్ట్రేలియన్ పరిశోధకులు తెలిపారు.

మహిళల శృంగార సామర్థ్యాన్ని పెంచే ‘బీపీ101’ అనే అణువును కనుగొన్నారు. ఈ అణువు మెదడుపై ప్రభావం చూపి శృంగారకాంక్షలు పెంచి యాక్టివ్ చేస్తుందని తేలింది.

ఈ ముక్కుద్వారా ఇచ్చే స్ప్రే ద్వారా ఈ వయాగ్రాను ముక్కులోకి స్ప్రే చేసినట్లయితే నాసికా కుహరం ద్వారా మెదడుకు చేరుతుందని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు. ఇది మ హిళల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని తేలింది.
Tags:    

Similar News