భార్యపై కన్నేసి వేధిస్తున్న ఈ పోలీసు ముక్కు.. చెవులు కోసేశాడు

Update: 2022-08-02 04:18 GMT
పోకిరి సినిమాలో.. ఇలియానాను పోలీసు అధికారి వేధింపులకు గురి చేయటం.. హీరో మహేశ్ సేవ్ చేయటం చూశాం.రీల్ కాబట్టి అలాంటి సీన్లు ఉంటాయి. కానీ.. అదే రియల్ అయి.. అందులో ఇలియానా పాత్రలో తన భార్య ఉంటే.. ఒక భర్త ఏం చేయగలడు? సినిమాల్ని పక్కన పెడితే నిజజీవితంలో ఇలాంటివి ఎదురైతే మిగిలిన భర్తలు ఏం చేస్తారో కానీ.. పాకిస్థాన్ లోని మహమ్మద్ ఇఫ్తికార్ మాత్రం వణుకు పుట్టే పని చేశాడు. అసలేం జరిగిందంటే..

పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని ఝుండ్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఇఫ్తికార్ తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అతడి భార్య మీద కన్నేశాడో పోలీస్ కానిస్టేబుల్. అతడి పేరు ఖాసిన్ హయత్. భర్త ఇంట్లో లేని వేళ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధింపులకు గురి చేసేవాడు. దీంతో.. విసిగిపోయిన ఆమె భర్తకుతన బాధను చెప్పుకుంది.

న్యాయం కోసం వారు పోలీసుల్ని ఆశ్రయించారు. ఫిర్యాదు చేశారు. కానీ.. పట్టించుకోలేదు. ఇలాంటివేళ.. ఒక రోజు డ్యూటీ ముగించుకొని వెళుతున్న ఖాసిన్ ను అడ్డుకున్న ఇఫ్తికార్.. అతడ్ని ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లాడు.

అతడిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడితో ఆగని ఇఫ్తికార్.. సదరు కానిస్టేబుల్ ముక్కు.. చెవులను కోసేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ జిల్లా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇఫ్తికార్ కోసం గాలింపులు జరుపుతున్నాడు. అతడి కోసం వెతికే పనిని మరింత ముమ్మరం చేశారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
Tags:    

Similar News