బాసర త్రిబుల్ ఐటి కాలేజీలో విద్యార్ధుల ఆందోళనల వేడి హైదరాబాద్ లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తగిలింది. బాసర కాలేజీలో విద్యార్ధులు ఆందోళనలు చేస్తుంటే వాళ్ళ తల్లి, దండ్రులు హైదరాబాద్ లోని మంత్రి ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. దాంతో రెండు ప్రాంతాల్లోను ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఐఐఐటికి పూర్తిస్ధాయి వైస్ ఛాన్సలర్ లేరు. వీసీ లేకపోవటంతో ఫ్యాకల్టీ కూడా సరిగా లేరట.
కాలేజీలో అడిగే వారు లేకపోవటంతో హాస్టల్ నిర్వహణంతా అస్తవ్యస్ధంగా తయారైపోయింది. హాస్టల్లో భోజనం సరిగా లేకపోవటం, కలుషితాహారాన్నే వడ్డిస్తుండటంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికి రెండుసార్లు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా విద్యార్ధులు ఆసుపత్రుల్లో చేరారు. చెడిపోయిన ఆహారాన్ని తమకు వడ్డిస్తున్నారనే కారణంగా శుక్రవారం నుండి విద్యార్ధులు మళ్ళీ ఆందోళన బాటపట్టారు.
తమ పిల్లలకు మద్దతుగా వాళ్ళ తల్లి, దండ్రులు కూడా ఆందోళనకు దిగారు. విచిత్రమేమిటంటే బాసరలో పిల్లలను, హైదరాబాద్ లో వాళ్ళ తల్లి, దండ్రులను పోలీసులు అరెస్టులు చేయటం. చూస్తుంటే ఇదంతా కేసీయార్ ప్రభుత్వంపై జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
వేలాదిమంది విద్యార్ధుల కనీస అవసరాలను తీర్చాలని కూడా కేసీయార్ ప్రభుత్వానికి లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ కాలేజీకే వీసీని నియమించకపోవటం, సరైన ఫ్యాకల్టీ లేకపోవటం, హాస్టల్లో చెడిపోయిన భోజనాన్ని వడ్డిస్తున్నారన్న విషయం వినటానికే విచిత్రంగా ఉంది.
చెడిపోయిన భోజనాన్ని ఎవరు మాత్రం ఎలాతింటారన్న కనీస ఇంగితం కూడా హాస్టల్ కాంట్రాక్టర్ కు రావటంలేదు. కాంట్రాక్టర్ ను మార్చమని విద్యార్ధులు ఎంత డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదు.
అంటే సదరు కాంట్రాక్టర్ అధికారపార్టీకి ఎంతటి సన్నిహితుడో అర్ధమైపోతోంది. వందలమంది విద్యార్ధులు ఏమైపోయినా పర్వాలేదు కానీ కాంట్రాక్టర్ ను మాత్రం మార్చకూడదని ప్రభుత్వం డిసైడ్ అయినట్లుంది. బహుశా బాసర విద్యార్ధుల నుండి మొదలైన ఈ వ్యతిరేకతే భవిష్యత్తులో టీఆర్ఎస్ పుట్టిముంచినా ఆశ్చర్యంలేదు.