తెలంగాణ‌లో డ్రోన్ తో మందుల డెలివ‌రీ

Update: 2015-08-16 10:15 GMT
భ‌విష్య‌త్తులో ప్ర‌తి ఇంట్లోనూ రెండు.. మూడు డ్రోన్లు ఉండ‌టం కామ‌న్ అనే మాట‌కు త‌గిన‌ట్లే..తాజాగా ప‌రిశోధ‌న‌లు సాగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు మందుల్ని స‌ర‌ఫ‌రా చేసేందుకు వీలుగా ఒక‌ప్ర‌యోగాన్ని తాజాగా తెలంగాణ‌లో విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్  హైద‌రాబాద్ కు (ఐఐపీహెచ్‌) చెందిన డ్రోన్ల సాయంతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ కు మందుల్ని స‌ర‌ఫ‌రా చేశారు.

500 గ్రాముల బ‌రువున్న మందుల్ని తీసుకెళ్లే ఈ డ్రోన్ నిర్దేశించిన విధంగానే మందుల్ని విజ‌య‌వంతంగా డెలివ‌రీ చేసింది. ప్ర‌స్తుతం ప‌రీక్ష ద‌శ‌లో ఉన్న ఈ విధానం కానీ విజ‌య‌వంతం అయితే.. డ్రోన్ల సాయంతో మందుల స‌ర‌ఫ‌రా చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. తొలుత‌.. మారుమూల ఉన్న ప్రైమ‌రీ సెంట‌ర్ల‌కు.. త‌ర్వాత ద‌శ‌లో వినియోగ‌దారుల ఇళ్ల‌కే డ్రోన్ల సాయంతో మందుల్ని స‌ర‌ఫ‌రా చేయాల‌న్నది ఆలోచ‌న ప్ర‌స్తుతం ఐఐపీహెచ్ వినియోగిస్తున్న డ్రోన్ల‌ను చైనాకు చెందిన ద జియాంగ్ కంపెనీ రూపొందించిన‌విగా చెబుతున్నారు. ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కూ ప‌లుమార్లు ఈ ప‌రీక్షలు నిర్వ‌హించి.. రోజువారీగా స‌ర‌ఫ‌రాలో ఉండే ఇబ్బందుల‌పై అధ్య‌య‌నం చేస్తార‌ని చెబుతున్నారు. అంటే.. డ్రోన్ల సాయంతో ఇంటికి వ‌స్తువులు వ‌చ్చే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌న్న‌మాట‌.
Tags:    

Similar News