అతి త్వరలో కరోనాను గుర్తించే రిస్ట్ !

Update: 2020-07-25 16:30 GMT
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిపోయేలా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోటి 50 లక్షలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆరున్నర లక్షల మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక దేశంలో 13 లక్షలకు పైగా కేసులు, 31వేలకు పైగా మరణాలు ఉన్నాయి. భౌతిక దూరం , మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా విజృంబిస్తుంది. ఇలాంటి సమయంలో కరోనా లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించడానికి వేరబుల్‌ రిస్ట్‌ ట్రాకర్‌ ను ఐఐటీ మద్రాస్‌ ఇంక్యుబేట్‌ రూపొందించింది. స్టార్టప్‌తో వచ్చే నెల మార్కెట్లోకి అందుబాటులోకి తేనుంది. దీని కోసం రూ.22కోట్ల నిధులను సమీకరించింది.

మ్యూస్‌ వేర్‌బేల్స్‌' ఎన్‌ఐటీ వరంగల్‌ పూర్వ విద్యార్థి బృందంతో కలిసి ఐఐటీ మద్రాస్‌లో ఇంక్యుబేట్‌ తయారుచేస్తున్నారు. ఈ రిస్ట్ బాండ్ శరీర ఉష్ణోగ్రతను, గుండె కొట్టుకునే వేగాన్ని ట్రాక్ చేస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ తెలియజేస్తుంది. కరోనా మహమ్మారి వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలో ఉంటే వీటి ద్వారా ట్రాక్ చేయడానికి సులువు అవుతోంది. దీన్ని మూజ్ హెల్త్ యాప్ అనే యాప్ ద్వారా మొబైల్ ఫోన్‌కు కనెక్ట్‌ చేయొచ్చు. యూజర్‌ డేటా ఫోన్‌తో పాటు రిమోట్‌ సర్వర్‌లో నిల్వ చేస్తుంది. కరోనా లక్షణాల కంటైనింగ్ ప్రాంతాల్లో వ్యక్తుల కేంద్రీకృత పర్యవేక్షణ కోసం కూడా అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ కల్పించబడుతుంది.

ట్రాకర్ ఆరోగ్య సేతు యాప్ నుంచి నోటిఫికేషన్లను కూడా అందిస్తుంది. దీనిద్వారా ఎవరైనా కంటైన్మెంట్ జోన్‌ లేదా కరోనా హాట్‌ స్పాట్ సెంటర్‌ లోకి వెళ్తే వెంటనే గుర్తించవచ్చు.ఈ ఏడాది తాము 2 లక్షల ఉత్పత్తులను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 2022 నాటికి పది లక్షలకు పెంచాలని భావిస్తున్నట్లు ఐఐటీ మద్రాస్ అలుమ్నీ కేఎల్ఎన్ సాయి ప్రశాంత్ చెబుతున్నారు. దీనికోసం తాము రూ.22 కోట్లు సమీకరించినట్లు చెప్పారు. సుమారు రూ.3500 ధర కలిగిన ఈ కొత్త వేరబుల్ ప్రొడక్ట్ ఆగస్టు నాటికి 70 దేశాల్లోని వినియోగదారులకు మార్కెట్‌లో లభ్యమవుతుందని తెలిపారు. శరీర ఉష్ణోగ్రతలు పరిమితికి మించి పెరిగినప్పుడు, SpO2 లెవల్స్ తగ్గినప్పుడు, కంటైన్మెంట్ జోన్‌ లోకి ప్రవేశించినప్పుడు... యూజర్లు దీనిని వినియోగిస్తే అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ అలర్ట్ ఉంటుంది.
Tags:    

Similar News