విశాఖలో స్థలం కొంటున్నారా.. జాగ్రత్త

Update: 2015-11-02 11:19 GMT
విశాఖలో భూమి కొనాలనుకుంటున్నారా.. అయితే, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ రియల్ వ్యాపారంలో భారీగా మోసాలు జరుగుతున్నట్లు తేలింది. పేరున్న సంస్థల వద్ద కొన్నవారూ మోసపోతున్నారట.

రాష్ట్ర విభజన తరువాత విశాఖ మరింత అభివృద్ది చెందుతుందున్న అంచనాలతో చాలామంది విశాఖలో స్థిరాస్తి పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారు.. అలాంటి వారు  రియల్ ఏజెంట్ల మాటలు నమ్మి దిగకుండా.. అన్నీ చూసుకుని కొనుగోలుచేయడం ఉత్తమం. విశాఖలో చాలావరకు అక్రమ లే అవుట్లేనని తేలింది.  ఒక ప్లాటు నలుగురైదుగురికి అమ్మేస్తున్నారట.  

విశాఖ మహానగరం లో సక్రమంగా వ్యాపారం చేసే రియల్ సంస్థలే కరవయ్యాయట. ఇన్నాళ్లు పేరన్న కంపెనీలు కాస్త పక్కాగా వ్యవహరించేవి  .  కానీ  ఇప్పుడు ఇవి కూడా పక్కదారులు పడుతున్నాయట.  అక్రమ లే అవుట్ల విషయంలో ఉడా వద్ద పూర్తి సమాచారం ఉంది. 145కి పైగా అక్రమ లే అవుట్లను ఉడా గుర్తించింది. ఉడా ఎల్సీ నెంబర్ ఇచ్చిన లే అవుట్లలోనూ లోపాలున్నాయట. ఈ సంగతి సాక్షాత్తు ఉడా అధికారులే చెబుతున్నారు.

కాబట్టి విశాఖలో స్థిరాస్తి కొంటే ముందుగా ఉడాకు వెళ్లి అక్కడ అన్ని వివరాలు తెలుసుకోవడం బెటర్. లేదంటే మునిగిపోతారు.
Tags:    

Similar News