ఓ భారీ రాకెట్ ను బెంగాల్ పోలీసులు బయటపెట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కతాలో ఆదాయపన్ను అధికారులతో పాటు.. పోలీసుల సాయంతో చేపట్టిన తనిఖీల్లో అక్రమ లాటరీ వ్యవహారం ఒకటి బయటకు రావటమే కాదు.. భారీ మొత్తంలో సొమ్ము బయటకు వచ్చింది. సోదాలు నిర్వహించిన ప్రాంతంలో దొరికిన నోట్లను లెక్కించటానికి మొత్తంగా 12 కౌంటింగ్ మిషన్లను గంటల కొద్దీ వాడితే కానీ లెక్క తేల లేదు.
అక్కడి రెండు అల్మారాలతో పాటు 16 గోనె సంచులు.. 27 ట్రావెల్ బ్యాగుల్లో లభించిన ఈ భారీ మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా దాచి ఉంచిన ఈ నోట్ల విలువ మొత్తంగా రూ.45 కోట్లుగా చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో నిర్వహించే నకిలీ లాటరీ బిజినెస్ కు సంబంధించి అక్రమంగా దాచి ఉంచిన సొమ్ముగా భావిస్తున్నారు. పాకిస్థాన్ లో రహస్యంగా తల దాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ కు ఈ భారీ మొత్తాన్ని తరలించే ప్రయత్నంలో ఉండగా.. అధికారులు తమకు అందిన సమాచారంతో ఈ రహస్య రాకెట్ ను చేధించారని చెబుతున్నారు. ఒకే ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంగా నగదు బయటపడటం పశ్చిమ బెంగాల్ లో హాట్ టాపిక్ గా మారింది.