కొత్త వెయ్యి రూపాయలు.. అసలా నకిలీయా?

Update: 2016-12-02 07:31 GMT
కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత ప్రవేశపెట్టిన కొత్త 500 నోట్లు ఇంకా పూర్తిగా రాలేదు. వచ్చిన కొద్దినోట్లు లోపాలతో ఉండడంతో చాలారకు బ్యాంకుల నుంచే వెనక్కు వెళ్లాయి. ఇక 2 వేల నోట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో అందుబాటులోకి వచ్చినా వాటికి నకిలీలు సులభంగా వచ్చేస్తున్నాయి. ఈ గందరగోళం ఇలా ఉండగానే సోషల్ మీడియాలో మరో కొత్త నోటు కనిపిస్తోంది. వయోలెట్ రంగులో ఉన్న వెయ్యి నోటు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇదే కొత్త వెయ్యి నోటు రూపం అంటూ జనం తెగ షేర్ చేస్తున్నారు.

అయితే... కేంద్రం కానీ, ఆర్బీఐ కానీ దీనిపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. వెయ్యినోటు మళ్లీ తెస్తామని సూచన ప్రాయంగా చెప్పినా ఎప్పుడన్నది ఇంకా ప్రకటించలేదు. అంతలోనే సోషల్ మీడియాలో ఇలా కొత్త నోటు కనిపిస్తుండడంతో ఇది నిజమైనదా.. నకిలీదా తెలియక చాలామంది అయోమయంలో పడుతున్నారు.

కాగా సోసల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కొత్త వెయ్యి నోటు చూస్తుంటే ఎవరో ఫొటోషాప్ లో దీన్ని మార్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడొచ్చిన 2 వేల నోటునే రంగు మార్చి, అంకెలు మార్చి పోస్టు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని చేయడంతో తేడాలు ఎక్కడా కనిపించనప్పటికీ... ఒక్క తేడా ఈ నోటుపై అనుమానం కలిగిస్తోంది. కొత్త 2 వేల నోటుకు రెండు వైపులా(కుడి - ఎడమవైపు) తెల్లని బోర్డర్ ప్రాంతంలో ఒక్కోవైపు 7 గీతలుంటాయి. ఆ కోడింగ్ కొత్త 500 నోటుపై 5 గీతలుగా మాత్రమే ఉంది. కానీ... సోషల్ మీడియాలో వస్తున్న కొత్త వెయ్యి నోటుపైనా 7 గీతలే ఉన్నాయి. అంటే... 2 వేల స్పెసిమన్ నోటుపై 2 వేలు అని అంకెల్లో కానీ, అక్షరాల్లో కానీ ఉన్న ప్రతి చోటా వెయ్యిగా మార్చి రంగు మార్చి సోషల్ మీడియాలో పెట్టినట్లుగా కనిపిస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News