అధికారం అండగా ఉంటే చాలు.. ఏమైనా చేస్తామన్నట్లుగా ఉంటుంది కొందరి వ్యవహారం. తాజాగా అలాంటి బరితెగింపునకు పాల్పడ్డాడో ముస్లిం పెద్ద. మతానికి ఏ మాత్రం సంబంధం లేని అంశంపై ఆయన ఏకంగా ప్రధానిపైనే ఫత్వా జారీ చేశారు. దేశంలో నల్లకుబేరులకు దడ పుట్టించేలా తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ జారీ చేసిన ఫత్వా ఇప్పుడు సంచలనంగా మారింది.
పశ్చిమ బెంగాల్ అధికారపక్షమైన మమతా బెనర్జీ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటారని చెప్పేముస్లిం పెద్ద దేశ ప్రధానిపై ఫత్వా జారీ చేయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కోల్ కతాలోని టిప్పు సుల్తాన్ మసీద్ షాహి ఇమామ్మౌలానా నురూర్ రెహ్మాన్ బర్కతి పేరుతో జారీ చేసిన ఈ ఫత్వా చూస్తే ఒళ్లు మండిపోవటమే కాదు.. చట్టం తన పని తానెందుకు చేయటం లేదన్న డౌట్ రాక మానదు.
ప్రధాని మోడీకి గడ్డం.. గుండుగీయించి.. ముఖానికి నల్లరంగు పూసిన వారికి రూ.25 లక్షల రివార్డు ఇస్తామని ఫత్వాలో పేర్కొన్నారు. నోట్ల రద్దు కారణంగా సామాన్యుల ఇబ్బందులు అంతకంతకూ పెరిగిపోతున్నాయని.. దేశంలో ఎక్కువ మంది ప్రజలు మమతా బెనర్జీని ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లుగా కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు.
అత్యున్నత స్థానంలో ఉన్న వారిపై ఈ తరహా ఫత్వా జారీ చేయటాన్ని పలువురు ఖండిస్తున్నారు. ఫత్వా జారీ చేయటం ద్వారా లక్ష్మణ రేఖను దాటిన సదరు ముస్లిం పెద్ద.. మత పెద్దలు.. మేథావులు మాత్రమే గడ్డం పెంచుతారని.. మోడీ గడ్డం పెంచుకొని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. పార్టీల సంగతిని పక్కన పెడితే.. రెచ్చగొట్టే ఈ తరహా ఫత్వాలకు చట్టబద్ధమైన చర్యలు తీసుకొని.. ఇష్టారాజ్యంగా వ్యవహరించటాన్ని చట్టం ఏ మాత్రం సహించదన్న విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.