``రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేస్తా`` అని ప్రకటించడం ద్వారా...కొద్ది కాలం నుంచి తెరమరుగు అయినపోయిన టీమిండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్ సంచలన రీతిలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్ కాంగ్రెస్ పార్టీలో కలకలానికి దారితీసింది. ఏకంగా నేతల బహిరంగ విమర్శలకు ఆ పార్టీ నేతలు దిగారు. అజహర్ ప్రకటన తెలంగాణ రాజకీయాలను హీటెక్కించింది. అయితే, ఈ కలకలం సద్దుమణగకముందే...తాజాగా మరో కీలక ప్రకటనతో వార్తల్లో నిలిచారు. అదే ఒకనాటి తన క్రికెట్ ప్రత్యర్థి - కాబోయే ప్రధానికి అడగకుండానే సలహాలు ఇచ్చి తెరకెక్కారు.
ఇదంతా పొరుగుదేవమైన పాకిస్థాన్ గురించే. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ రాకపోయినా పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ - పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రధాని కాబోతున్న విషయం తెలిసిందే. ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో అజహార్ రియాక్టయ్యారు. కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన దేశం కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షించారు. ``పాక్ క్రికెట్ టీంకు కెప్టెన్ గా ఉన్నపుడు ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగతంగా - టీం పరంగా మంచి - గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. మ్యాచ్ ల సమయంలో ఏం జరుగతుందోనని మేం ఎదురుచూసే వాళ్లం. ఇపుడు దేశానికి కెప్టెన్ గా (ప్రధాని) చాలా సమస్యలకు పరిష్కారం ఆలోచించాల్సిన సమయం. క్రికెట్ టీంకు నాయకత్వం వహించడం..దేశానికి ప్రాతినిధ్యం వహించడం రెండు వేర్వేరు అంశాలు` అని అజరుద్దీన్ అన్నారు.
క్రికెటర్ ఓ దేశానికి ప్రధానికి కావడం అత్యంత అరుదైన విషయమని - పాక్ లో మెజార్టీ సాధించిన ఇమ్రాన్ ఖాన్ కు అజరుద్దీన్ శుభాకాంక్షలు చెప్పాడు. అయితే, ఇమ్రాన్ ప్రధాని అయితే భారత్ - పాక్ మధ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అన్న ప్రశ్నకు అజరుద్దీన్ సమాధానమిస్తూ..``ఇమ్రాన్ ఖాన్ మొదట పాక్ లో పరిష్కరించే సమస్యలు ఎక్కువున్నాయి. అక్కడున్న సమస్యలు తగ్గిన తర్వాతే మిగతా సమస్యలపై దృష్టి పెట్టడం మంచింది. పాకిస్థాన్ తో సానుకూల చర్చలకు చాలా అవకాశాలున్నాయి` అని అజరుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే శత్రుత్వ భావన ఎక్కువుంటే అక్రమ చొరబాట్లు - దాడులే జరిగే అవకాశముంటుంది. అపుడు చర్చలతో కూడా ప్రయోజనం ఉండదు. మొదట వారిలో ఆ భావన తీసివేసిన తర్వాత చర్చలు జరిపితే బాగుంటుందని అజరుద్దీన్ సూచనలు చేశాడు.