జిన్నా ఇంటిని కూల్చొద్దంటూ ఇమ్రాన్ రిక్వెస్ట్‌

Update: 2017-04-06 17:34 GMT
ముంబ‌యిలోని ఒక ఇంటి కోసం పాక్ స‌ర్కారు మొద‌లుకొని.. పిటీఐ పార్టీ  నేత‌.. ఒక‌ప్ప‌టి ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ వ‌ర‌కూ అంద‌రూ భార‌త్ ను తెగ రిక్వెస్ట్ చేసేస్తున్నారు. త‌మ‌కు ఆ ఇంటిని త‌మ‌కు ఇచ్చేయాల‌ని పాక్ కోరుతోంది. పాక్ అంత‌లా అడుగుతున్న ఆ ఇంట్లో ఏముంది? దాని ప్ర‌త్యేక‌త ఏమిటి? అన్న‌వివ‌రాల్లోకి వెళితే.. ఆస‌క్తిక‌ర‌మైన విశేషాలు చాలానే బ‌య‌ట‌కు వ‌స్తాయి. మ‌రి.. ఆ వివ‌రాల్లోకి వెళ్లాలంటే ముంబ‌యికి వెళ్లాల్సిందే. భార‌త‌దేశానికి జాతిపిత మ‌హాత్మ‌గాంధీ ఎలానో.. ఇండియా రెండు ముక్క‌లు కావ‌టానికి.. పాకిస్థాన్ ఏర్ప‌డ‌టానికి కార‌ణం మ‌హ్మ‌ద్ అలీ జిన్నా.  అందుకే ఆయ‌న్ను పాక్ జాతిపిత‌గా ఆ దేశ ప్ర‌జ‌లు కొలుస్తుంటారు.

అయితే.. జిన్నా నివాసం ముంబ‌యిలో ఉండేది. ద‌క్షిణ ముంబ‌యిలోని 2.5 ఎక‌రాల స్థ‌లంలో జిన్నా ప్యాల‌స్ ఉంది. కోట్లాది మంది భార‌తీయుల విభ‌జ‌న బాధ‌కు గుర్తుగా.. దేశం రెండు ముక్క‌లైన విషాదానికి సాక్ష్యంగా జిన్నా హౌస్ నిలుస్తుంది. దేశ విభ‌జ‌న‌కు చిహ్న‌మైన జిన్నా ఇంటిని కూల్చివేసి.. దాని స్థానంలో మ‌హారాష్ట్ర సంస్కృతిని ప్ర‌తిబింబించేలా నిర్మాణాన్ని చేప‌ట్టాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మంగ‌ల్ లోధా కోరుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఎనిమీ ప్రాప‌ర్టీ చ‌ట్టాన్ని తీసుకొచ్చిన నేప‌థ్యంలో జిన్నా హౌస్ భార‌త ఆస్తి అని.. దాని నిర్వ‌హ‌ణ కోసం ఏటా కోట్లాది రూపాయిలు ల‌క్ష‌లాది రూపాయిలు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంద‌ని వ్యాఖ్యానించారు.

బీజేపీ ఎమ్మెల్యే నోటి నుంచి వ‌చ్చిన డిమాండ్‌కు పాక్‌లోని వారంతా ఒక్క‌సారి ఉలిక్కిప‌డ‌ట‌మేకాదు.. త‌మ దేశ జాతిపిత ఇంటిని కూల్చొద్దంటూ రిక్వెస్ట్ మీద రిక్వెస‌ట్ చేస్తున్నారు. తాజాగా ఈ ఉదంతం మీద ఇమ్రాన్ ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేస్తూ.. ముంబ‌యిలోని జిన్నా ఇంటిని కూల్చివేయాలంటూ వ‌స్తున్న వాద‌న‌ల‌పై ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. చ‌రిత్ర‌ను కూల్చే ప్ర‌య‌త్నాలు చేయొద్ద‌న్నారు. జిన్నా ఇంటిని కూల్చేయాల‌ని భార‌త నాయ‌కులు చెప్ప‌టం దుర‌దృష్ట‌క‌రంగా అభివ‌ర్ణించిన ఆయ‌న త‌మ‌కు అప్ప‌గించాల్సిందిగా కోరారు.

జిన్నా ఇల్లు పాక్ చారిత్ర‌క ఆస్తి అని.. దానిని భార‌త్ గౌర‌వించి భ‌ద్ర‌ప‌ర్చాల‌ని కోరింది. త‌మ జాతిపిత ఇంటిని త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరింది. సుమారు 400 మిలియ‌న్ డాల‌ర్ల విలువ చేసే ఈ ఇంటిని భార‌త ప్ర‌భుత్వం ప‌రిర‌క్షిస్తుంద‌న్న ఆశాభావాన్ని ప‌లువురు పాకిస్థానీయులు కోరుకుంటున్నారు. జిన్నా ఇంటిని త‌మ‌కు అప్ప‌గిస్తామ‌ని ఇప్ప‌టికే భార‌త్ చాలాసార్లు హామీ ఇచ్చింద‌ని ఇంత‌వ‌ర‌కూ ఆ మాట‌ను నిల‌బెట్టుకోలేదంటూ పాక్ విదేశాంగ శాఖ అధికారిక ప్ర‌తినిధి న‌ఫీజ్ జ‌కారియా వ్యాఖ్యానించారు. ఏమైనా.. ముంబ‌యిలోని జిన్నా ఇంటి కోసం పాకిస్థానీయులు విప‌రీతంగా త‌పిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News