ఇమ్రాన్ మాజీ భార్య ఆత్మ‌క‌థతో ర‌చ్చ ర‌చ్చ‌!

Update: 2018-06-08 04:54 GMT
ఆత్మ‌క‌థ‌ను పుస్త‌కంగా తీసుకురావ‌టం పాత‌దే అయినా.. సినిమాగా తీసుకురావ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది. వివాదాల జోలికి వెళ్ల‌కుండా ఉండే వారు కొంద‌రైతే.. కాస్త ఓపెన్ గా త‌మ జీవితాన్ని పుస్త‌కంలో ఆవిష్క‌రించి తామెంత ఓపెన్ గా ఉంటామ‌న్న విష‌యాన్ని చెప్పేవారు మ‌రికొంద‌రు. అయితే.. త‌న‌కు సంబంధం లేకున్నా.. త‌న‌కు తెలిసిన వారికి సంబంధించిన అంశాల్ని సంచ‌ల‌నాలుగా బ‌య‌ట‌పెట్టే తీరు చాలా త‌క్కువ మందిలో ఉంటుంది. తాజాగా అలాంటి ప‌నే చేసి అంత‌ర్జాతీయంగా ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు మాజీ క్రికెట‌ర్ క‌మ్ రాజ‌కీయ నాయ‌కుడి మాజీ భార్య‌(రెండో) రేహ‌మ్ ఖాన్‌.

త‌న విష‌యాలనే కాదు.. త‌న‌కు తెలిసిన వారు.. ప‌రిచ‌యం ఉన్న వారికి సంబంధించిన ఆమె చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు అంత‌ర్జాతీయంగా సంచ‌ల‌నంగా మారుతున్నాయి. త‌న మాజీ భ‌ర్త‌తో పాటు.. పాకిస్థాన్ కు చెందిన మాజీ క్రికెట‌ర్ అక్ర‌మ్ గురించి త‌న ఆత్మ‌క‌థ పుస్త‌కంలో ఆమె ప్ర‌స్తావించిన అంశాలు షాకింగ్ గా మారాయి.

వ‌చ్చే నెల‌లో పాక్ లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతున్న వేళ రేహ‌మ్ ఖాన్ నుంచి వ‌స్తున్న పుస్త‌కం వివాదాస్ప‌దంగా మారుతోంది. ఆమె పుస్త‌కం రిలీజ్ కు ముందే ఆన్ లైన్లో పుస్త‌కంలోని కొన్ని భాగాలు లీక్ అయ్యాయి. ఇందులో ప్ర‌స్తావించిన ఆంశాలు ఊహించ‌నిరీతిలో ఉన్నాయి.

అక్ర‌మ్ శృంగార జీవితంపై ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆక్ర‌మ్ త‌న భార్య‌తో శృంగారం చేయ‌టానికి ఒక న‌ల్ల జాతీయుడ్ని ఏర్పాటు చేసి.. వారిని చూస్తూ ఆనందించేవాడ‌న్నారు. దీన్ని సీరియ‌స్ గా తీసుకున్న ఆక్ర‌మ్ ఆమెపై ప‌రువు న‌ష్టం దావా వేశారు.

తొమ్మిదేళ్ల క్రితం మ‌ర‌ణించిన (2009) త‌న భార్య‌ను ఇలా అగౌర‌వ‌ప‌ర్చ‌టం ఏమిటంటూ ఆయ‌న ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఆమె నీచ ప్ర‌వ‌ర్త‌న‌కు ఇదో నిద‌ర్శ‌న‌మ‌న్నారు. రేహామ్ ఒక తల్లే అయినా డ‌బ్బు కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని విమ‌ర్శించారు. ఇమ్రాన్.. రేహామ్ పెళ్లి సంద‌ర్భంగా ఇచ్చిన విందులో మాత్ర‌మే తాను ఆమెను చూసిన‌ట్లుగా చెప్పారు. మ‌ర‌ణించిన త‌న భార్య‌పై రేహామ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న కోర్టుకు ఎక్కారు.

త‌న ఆత్మ‌క‌థ‌లో త‌న మాజీ భ‌ర్త ఇమ్రాన్ తో పాటు.. ప‌లువురు ప్ర‌ముఖుల్ని ల‌క్ష్యంగా చేసుకోవ‌టంతో ఆమె తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త‌న మొద‌టి భ‌ర్త డాక్ట‌ర్ ఇజాజ్ రెహ్మాన్‌.. బ్రిటిష్ వ్యాపార‌వేత్త స‌య్య‌ద్ జుల్ఫిక‌ర్ బుఖారితో పాటు ప‌లువురి మీద ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేవారు. ఇమ్రాన్ కోసం అత‌డి స‌న్నిహితుడు బుఖారి  మ‌హిళ‌ల్ని స‌ర‌ఫ‌రా చేసేవాడ‌ని.. ఒక అమ్మాయి గ‌ర్భం దాలిస్తే అబార్ష‌న్ కూడా చేయించిన‌ట్లుగా పేర్కొన్నారు. రేహానా వ్యాఖ్య‌లు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి.


Tags:    

Similar News