ఒకటి తర్వాత ఒకటిగా.. వరుస పెట్టి సంచలన నిర్ణయాల్ని తీసుకుంటున్న ప్రధాని మోడీ పుణ్యమా అని దేశంలోని పలు రాజకీయ పార్టీలు మాత్రమే కాదు.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ఇరిటేట్ అయిపోతున్నారు. ఇదెంత ఎక్కువగా ఉందంటే..తాను పాల్గొన్న సమావేశానికి సంబందించి ఎజెండాను సైతం మర్చిపోయేంతగా ఆయన ఆవేశంతో ఊగిపోతున్నారు. మోడీ సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఆ దేశంలో రొట్టెలకు సైతం రేషన్ విధించిన పరిస్థితి. రొట్టెల ధరలు సైతం భారీగా పెరిగిపోయాయి. ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. రొట్టెలకే కొరత ఉందంటే.. మిగిలిన వాటి పరిస్థితి మరెలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఓపక్క తమ దేశంలో పరిస్థితులు సానుకూలంగా లేని వేళలో.. వరుస పెట్టి మోడీ తీసుకుంటున్న చర్యలు.. ఇమ్రాన్ కు ఒక పట్టాన మింగుడుపడటం లేదు.
దీంతో.. ఆయన బెదిరింపు మాటల్ని ఆయుధంగా చేసుకున్నారు. కశ్మీర్ అంశంపై భారత ప్రభుత్వ తీరును తప్పు పట్టిన ఆయన.. ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేయటం ఏమిటని ప్రశ్నిస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ - పాక్ మధ్య సంప్రదాయ యుద్ధం రావొచ్చన్నారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో భారత్ లో మరిన్ని ఘటనలు చోటు చేసుకునే వీలుందని.. కశ్మీరీలను ఎంతగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తే.. వారు తమ హక్కుల కోసం అంతగా పోరాటం చేస్తారన్నారు.
కశ్మీర్ పై మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో పాక్ పార్లమెంట్ ఉభయ సభలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. మోడీ సర్కారు తీరును దుమ్మెత్తి పోశారు. బీజేపీది జాత్యాంహకార సిద్ధాంతమని.. ఆ పార్టీకి హిందువుల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణిస్తుందన్నారు. భారత్ ను ముస్లింలు 500-600 ఏళ్లు పాలించినందుకే వారంటేనే ఆగ్రహంతో ఉన్నారన్నారు. కశ్మీర్ పై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ న్యాయస్థానాల ముందుకు వెళతామని.. ప్రపంచ దేశాలన్ని భారత్ చర్యను దునుమాడాలంటూ పిలుపునిచ్చారు. భారత్ తో తానెంత కలిసిపోవాలని ప్రయత్నించినా.. ఆ దేశంతో తనకు తిరస్కారమే ఎదురైందన్నారు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేయటాన్నినిరసిస్తూ తీర్మానం చేయటానికి హాజరైన పార్లమెంటు సమావేశంలో భారత్ తీరును నిరసిస్తూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టాల్సిన ఇమ్రాన్.. మోడీ సర్కారు మీద ఆవేశంతో అసలు విషయాన్ని మర్చిపోయారు. చివరకు సహాయకులు అలెర్ట్ చేయటంతో దాన్ని ప్రవేశ పెట్టారు. ఇదిలా ఉండగా.. తాజా పరిణామాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధానికి అవకాశం ఉందని.. రెండు అన్వస్త్ర దేశాల మధ్య యుద్ధం జరిగితే.. ఎవరూ గెలవరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి.. ఇమ్రాన్ వ్యాఖ్యలపై మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.