మోదీని ఇమ్రాన్ ఖాన్ పిల‌వ‌లేద‌ట‌!

Update: 2018-08-02 13:18 GMT
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ - పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) అధ్య‌క్షుడు ఇమ్రాన్ ఖాన్ (65) తాజాగా జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆగస్టు 11న పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ అట్ట‌హాసంగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నార‌ని మీడియాలో వార్త‌లు వ‌స్తున్న విష‌యం విదిత‌మే. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి భార‌త ప్రధాని నరేంద్ర మోడీతోపాటు `సార్క్`(ఆఫ్ఘనిస్థాన్ - నేపాల్ - భూటాన్ - భారత్ - బంగ్లాదేశ్ - మాల్దీవులు - శ్రీలంక)  దేశాధినేతలను ఆహ్వానించాలని ఇమ్రాన్ భావిస్తున్నార‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆ పుకార్ల‌పై పాక్‌ విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది. ఆగస్టు 11న జరగనున్న  ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ నేతలను ఎవ‌రినీ ఆహ్వానించడం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఈ కార్యక్రమానికి ఇమ్రాన్ కు అత్యంత సన్నిహతులైన  కొందరు విదేశీ వ్యక్తులను మాత్రమే ఆహ్వానించినట్లు చెప్పింది. ప్ర‌మాణ స్వీకార‌ వేడుకలకు అంతర్జాతీయ నాయకులు హాజ‌ర‌వుతున్నార‌ని వ‌స్తోన్న మీడియా ఊహాగానాలు అవాస్త‌వ‌మ‌ని పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరీ వెల్లడించారు. ఇవాన్-ఇ-సదర్ లేదా ప్రెసిడెంట్ హౌస్‌లో చాలా సింపుల్ గా ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. విదేశీ నేతలను ఆహ్వానించకూడదని నిర్ణయించామని... ఒక జాతీయ కార్యక్రమంగానే దీన్ని నిర్వహించబోతున్నామని ఫవాద్ చెప్పారు. ఇమ్రాన్ కు చెందిన కొందరు సన్నిహిత మిత్రులు మాత్రమే విదేశీ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారని తెలిపారు. బాలీవుడ్‌ హీరో ఆమీర్‌ ఖాన్‌ - భారత మాజీ  క్రికెటర్లు  సునీల్‌ గవాస్కర్‌ - కపిల్‌ దేవ్‌ - నవజోత్ సింగ్ సిద్ధూలకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. తాజాగా, పీటీఐ వెలుర‌రించిన ప్ర‌క‌ట‌న‌తో ఆ ఊహాగానాల‌కు తెర‌ప‌డిన‌ట్ల‌యింది.
Tags:    

Similar News