మీదకొచ్చాక.. పాకిస్తానీల శాంతిమంత్రం

Update: 2019-02-28 09:22 GMT
భారత్-పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈసారి యుద్ధమంటూ జరిగితే పరిస్థితులు ఏరకంగా ఉంటాయో ముందుగానే ఊహించుకున్న పాకిస్తానీయులు శాంతిమంత్రం జపిస్తున్నారు. పాక్ ప్రధానికి ఇంటా బయటా నుంచి ఒత్తిడి పెరుతుంది. తాజాగా పాక్ కిక్రెట్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ప్రస్తుత పరిస్థతులపై స్పందించారు. ‘ బరువెక్కిన హృదయంతో భారత్ ను విజ్ఞప్తి చేస్తున్నా.. పాకిస్తాన్ మీ శత్రువు కాదు.. మీ శత్రవు మా శత్రువు ఒక్కరే.. ఒకే శత్రవుపై ఇద్దరూ పోరాడుతున్నది తెలుసుకునేందుకు ఇంకెంత రక్తం చిందించాలి?.. అంటూ ట్వీట్ చేశారు.

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత ఎయిర్ ఫోర్స్ పాక్ ఉగ్ర స్థావరాలపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా పరిస్థితులపై స్పందిస్తూ యుద్ధం మొదలైతే ఆపడం తమ వల్ల కాదని చేతులేత్తేశాడు.. దీంతో భారత్ సామర్థ్యం తెలిసిన పాకిస్తానీయులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఒక్కసారిగా పాకిస్తానీయులు సోషల్ మీడియాలో ‘సే నో టూ వార్’ అంటూ హ్యష్ ట్యాగ్ జోడించి పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ ట్యాగ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

నిజంగా ఇమ్రాన్ ఖాన్ శాంతిని కోరుకుంటే తమ సైన్యానికి చిక్కిన పైలట్ అభినందన్ ని భారత్ కు అప్పగించి చిత్తశుద్ధి చాటుకోవాలని పాకిస్తానీయులు పాక్ ప్రధానిపై ఒత్తిడి చేస్తున్నారు.  పాక్ సెలబ్రెటీలు కూడా ఆయనపై ఒత్తిడి తెస్తుండటంతో ఇమ్రాన్ ఖాన్ శాంతి మంత్రం జపిస్తున్నారు.

అయితే పాక్ ప్రధాని నిర్ణయం కంటే ఆ దేశంలో సైన్యం మాటే చెల్లుతుంది. పాక్ సైన్యం ఎప్పుడూ కూడా ఉగ్రవాదులకే కొమ్ము కాస్తుంటుంది. ఉగ్రవాదులు భారీగా చనిపోవడంతో రగలిపోతున్న పాక్ సైన్యం కయ్యానికి కాలు దువ్వుతుంది. భారత్ సామర్థ్యం తెలిసిన పాకిస్తానీయులు మాత్రం యుద్ధాన్ని నివారించాలని పాక్ ప్రధానితోపాటు, పాక్ సైన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. నిమిష నిమిషానికి పరిస్థితులు మారుతుండటంతో ఏం జరుగుతుందో తెలియడం లేదు. యుద్ధం ఆపాలంటే పాక్ ఉగ్రవాదుల ఏరివేతలో భారత్ కు సహకరించాలి.. లేకపోతే తగిన మూల్యం తప్పదని ప్రపంచ దేశాలు సైతం హెచ్చరిస్తున్నాయి. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.


Tags:    

Similar News