వన్డే ప్రపంచ కప్ తో పాక్ కు ఇమ్రాన్ ప్రధాని.. టి20 కప్ తో బాబర్.. గావస్కర్ జోస్యం
అది 1992 వన్డే ప్రపంచ కప్.. పాకిస్థాన్ ఏమాత్రం ఆశల్లేని స్థితి నుంచి విజేతగా నిలిచింది. ఓ దశలో అట్టడుగున నిలిచిన ఆ జట్టు ఆ వెంటనే పుంజుకుని జగజ్జేత అయింది. దీని వెనుక
ఉన్న శక్తి ఇమ్రాన్ ఖాన్. అతడి నాయకత్వ సామర్థ్యం.. వెనుకంజ వేయొద్దంటూ సహచరుల్లో నూరిపోసిన ధైర్యం.. కుర్రాళ్లపై ఉంచిన విశ్వాసం.. పాకిస్థాన్ ను తొలిసారి ప్రపంచ విజేతను
చేశాయి. అంతేకాక ఇమ్రాన్ నాడు జట్టులోకి తెచ్చిన ఇంజమాన్ వంటి ఆటగాళ్లు తర్వాత అంతర్జాతీయ స్థాయి మేటి ఆటగాళ్లుగా ఎదిగారు.
ఇక ఆ ప్రపంచ కప్ అందించిన అనంతరమే ఇమ్రాన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తల్లి పేరిట క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుతో సంఘ సేవలోకి దిగాడు. నాలుగేళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఎఫ్) పేరిట పార్టీని ఏర్పాటు చేశాడు. దాదాపు 22 ఏళ్ల పోరాటం తర్వాత 2018లో పాకిస్థాన్ ప్రధాని అయ్యాడు. ఈ ఏడాది వేసవిలో ఆ పదవినుంచి దిగిపోవాల్సి వచ్చింది.
అప్పట్లో ఇమ్రాన్.. ఇప్పుడు బాబర్ కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ ఫైనల్ కు చేరింది. అదికూడా 1992లో పాకిస్థాన్ జట్టు ఏ విధంగానైతే వన్డే ప్రపంచ కప్ ప్రయాణం సాగించిందో అదే విధంగా తుది సమరానికి వచ్చింది. అప్పుడూ ఇప్పుడూ బౌలింగ్-బ్యాటింగ్ వనరులు ఒకేలా ఉన్నాయి. నాడు న్యూజిలాండ్ ను ఓడించి ఫైనల్ కు రాగా.. నేడూ అదే
జరిగింది. ఇక అప్పట్లో తుది సమరంలో ప్రత్యర్థి ఇంగ్లండ్ కాగా.. నేడూ అదే జట్టు. దీంతో చరిత్ర మళ్లీ నమోదవుతుందా? అని ఆసక్తి కలుగుతోంది.
ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర పోలిక తెచ్చాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గురువారం భారత్, ఇంగ్లాండ్ రెండో సెమీస్ మ్యాచ్ ప్రారంభానికి ముందు గావస్కర్ ఓ క్రీడా ఛానెల్‌లో మాట్లాడుతూ.. "బాబర్ అజామ్ నాయకత్వంలోని పాక్ టైటిల్‌ను గెలిస్తే.. 2048లో అతడు పాక్‌కు ప్రధాని అవుతాడు" అని సరదాగా వ్యాఖ్యానించాడు.
మరో 15 ఏళ్లకు గాని..బాబర్ ప్రస్తుత వయసు 28. మరో పదేళ్లు అతడు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతాడు. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లలో ఒకడిగా నిలిచిపోయే అవకాశం కూడా ఉంది. అయితే,
బాబర్ కు ఇమ్రాన్ స్థాయి ఇప్పటికైతే లేదని చెప్పొచ్చు. నాయకత్వంలో ఇమ్రాన్ ది పోరాట తత్వం. కానీ, బాబర్ ప్రశాంతంగా పనిచేసుకుపోతాడు. దూకుడు తక్కువ. అయితే, పాక్ కు
ప్రపంచ కప్ అందించే నాటికి ఇమ్రాన్ వయసు 38. సరిగ్గా బాబర్ మరో పదేళ్లు ఆడితే అప్పటికి 38 ఏళ్లు వస్తాయి. ఆపై మరో ఐదేళ్లలో పాకిస్థాన్ కు ప్రధాని అయ్యే చాన్సుందని గావస్కర్
అంటున్నాడు. చూద్దాం.. మరి 2048కి అతడి అంచనా నెరవేరుతుందో? లేదో?
బాబర్ కు గావస్కర్ గిఫ్ట్ ఇటీవల పాక్ కెప్టెన్ బాబర్.. గావస్కర్ ను కలుసుకున్నాడు. పాక్ కోచింగ్ టీం ఆహ్వానం మేరకు గావస్కర్ వారి డ్రెస్సింగ్ రూమ్ లేదా హోటల్ కు వెళ్లినట్లు యూట్యూబ్ లోని వీడియో
ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఈ సందర్బంగా బాబర్ గావస్కర్ కు అమిత గౌరవం ఇచ్చాడు. ఓ క్యాప్ పై గావస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.